Site icon NTV Telugu

Samantha: విడిపోవడం, అనారోగ్యం.. అన్నీ బహిరంగంగానే ఎదుర్కొన్నా..

Samantha

Samantha

అందాల తార సమంత ఎప్పుడూ తన నిజాయితీ, ధైర్యం, స్పష్టతతో అభిమానుల మనసులు గెలుచుకుంటూ వస్తుంది. కెరీర్‌లో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా రాణిస్తూ, విభిన్నమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది. అదే సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్’ వంటి ప్రాజెక్ట్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Also Read : Surya : సూర్య – ఫహద్‌ ఫాజిల్‌ కాంబో ఫిక్స్‌..!

తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సమంత, తన జీవితంలోని కష్టాలు, విమర్శలు, నేర్చుకున్న పాఠాల గురించి ఎంతో ఓపెన్‌గా మాట్లాడింది. “నా జీవితంలో జరిగిన ప్రతి విషయమూ ప్రజల ముందు బహిరంగంగానే జరిగింది. అది విడిపోవడం కావచ్చు, అనారోగ్యం కావచ్చు. ఆ సమయాల్లో చాలా విమర్శలు ఎదుర్కొన్నా. అయినా నా నిజమైన జీవితాన్ని దాచిపెట్టాలనుకోలేదు. నేనూ తప్పులు చేస్తాను, తడబడుతాను, కానీ మెరుగ్గా మారడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. జీవితాన్ని పరిపూర్ణంగా చూపించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే గుర్తింపు అనేది అంతిమ గమ్యం కాదు, అది ఒక నిరంతర ప్రయాణం,” అని ఆమె చెప్పింది.

అలాగే నేటి యువతకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చింది.. “ఆశయాలు ఎన్ని ఉన్నా వాటికి సరైన ఉద్దేశం ఉండాలి. మన జీవితంలో మెంటార్‌ ఎంచుకోవడం చాలా ముఖ్యం. అది మన భవిష్యత్తుని మార్చే నిర్ణయం అవుతుంది. అలాగే సెలెబ్రిటీలు కూడా సోషల్‌ మీడియాలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి” అని సూచించింది. చివరగా తన జీవితం గురించి మాట్లాడుతూ..“నేనొక సాధారణ కుటుంబం నుంచి వచ్చాను. మొదటి సినిమా తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. రాత్రికి రాత్రే స్టార్‌ అయ్యా. పేరు, కీర్తి, డబ్బు, చప్పట్లు అన్నీ వచ్చాయి. కానీ అవన్నీ నాకు ఓ పాఠం నేర్పించాయి నిజాయతీతో ఉన్నప్పుడే మనలో స్థిరత్వం వస్తుంది” అని చెప్పింది సమంత.

Exit mobile version