Site icon NTV Telugu

సమంత సెకండ్ ఇన్నింగ్స్.. ఇంత ఘాటు గానా..?

samantha

samantha

అక్కినేని నాగ చైతన్య తో విడాకుల తరువాత సమంత రూటు మార్చింది. ఒకపక్క సినిమాలు, మరో పక్క యాడ్స్ తో బిజీగా మారిపోయింది. ఇక తాజాగా అమ్మడు కవర్ పేజీ కూడా ఎక్కేసింది. ‘ఎల్లే ఇండియా’ మ్యాగజైన్ కవర్ పేజీ లో గ్లామర్ ఫోజ్ లో పిచ్చెక్కిస్తోంది. రెడ్ హాట్ డ్రెస్ వేసుకొని సోఫాలో తాపీగా కూర్చొని మోడల్ లుక్ తో మెరిపించింది. ఇక ఈ కవర్ పేజీని సామ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

సామ్ 11 ఏళ్ళ కెరీర్ లో హీరోయిన్ నుంచి పరిణీతి చెందిన వ్యక్తిగా ఎలా ఎదిగింది అనేది ఈ కవర్ పేజీలో తెలుసుకోవచ్చని తెలిపింది. సామ్ కి ఇది రెండో ఫేజ్ అని తెలిపిన ‘ఎల్లే ఇండియా.. తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాల్ని ఈ మ్యాగజైన్ లో పొందుపరిచినట్లు తెలిపింది. ఇక ఎల్లే డిజటల్ కవర్ స్టార్ పేరిట ఉన్న మ్యాగజైన్ కవర్ పేజ్ లో కూడా సమంత ఫోటోనే ప్రింట్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ మ్యాగజైన్ కోసం సామ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

https://www.instagram.com/p/CW7SdyPBIJn/

Exit mobile version