Site icon NTV Telugu

Samantha : కొత్త ప్రయాణం మొదలైంది అంటూ.. గుడ్ న్యూస్ చెప్పిన సమంత ..

Samantha

Samantha

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలతో పాటు వ్యాపార రంగంలో కూడా తనదైన ముద్ర వేస్తోంది. కొంతకాలం ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు మళ్లీ పూర్తి స్థాయిలో ప్రొఫెషనల్ లైఫ్‌లోకి తిరిగి వచ్చింది. వరుసగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ, నిర్మాతగా కూడా కొత్త ప్రయోగాలు చేస్తోంది. తాజాగా సమంత తన సొంత బ్యానర్‌ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ కింద ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమం ఇటీవలే ఘనంగా జరిగింది. ఇందులో సమంతతో పాటు దిగంత్‌, గుల్షన్‌ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించగా, సీనియర్ నటి గౌతమి, మంజుషా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను రాజ్‌ నిడుమోరు, హిమాంక్‌ దువ్వూరుతో కలిసి సమంత నిర్మిస్తున్నారు.

Also Read : Betting App Case : బెట్టింగ్ యాప్ కేసులో.. నేడు CID సిట్ ముందుకు నటుడు ప్రకాశ్ రాజ్

ఇక సినిమాలతో పాటు సమంత వ్యాపార రంగంలో కూడా వేగంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆమె ‘Saaki’ పేరుతో క్లాతింగ్‌ బ్రాండ్‌ను విజయవంతంగా నడుపుతోంది. ఆ తర్వాత పెర్ఫ్యూమ్‌ బిజినెస్‌లో అడుగు పెట్టిన సామ్‌, ఇప్పుడు మరోసారి కొత్త వెంచర్‌ను ప్రారంభించింది. తాజాగా సమంత ‘Truly Sma’ అనే కొత్త క్లాతింగ్‌ బ్రాండ్‌ను లాంచ్‌ చేసింది. ఈ సందర్భంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రమో వీడియోను షేర్‌ చేస్తూ, “A New Chapter Begins” అనే క్యాప్షన్‌ ఇచ్చింది. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, సినీ ప్రముఖులు సమంతకు శుభాకాంక్షలు తెలుపుతూ .. “సామ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా సక్సెస్‌ అవ్వాలి”, “Truly Samantha స్టైల్‌ ఎప్పుడూ యూనిక్‌గా ఉంటుంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొత్త వ్యాపార ప్రయాణం మొదలెట్టిన సమంత ఇప్పుడు నిజంగానే ఒక ‘Truly Sma’ మోడ్‌లో ఉన్నట్టుంది!

Exit mobile version