Samantha : కొత్త ప్రయాణం మొదలైంది అంటూ.. గుడ్ న్యూస్ చెప్పిన సమంత ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలతో పాటు వ్యాపార రంగంలో కూడా తనదైన ముద్ర వేస్తోంది. కొంతకాలం ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు మళ్లీ పూర్తి స్థాయిలో ప్రొఫెషనల్ లైఫ్‌లోకి తిరిగి వచ్చింది. వరుసగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ, నిర్మాతగా కూడా కొత్త ప్రయోగాలు చేస్తోంది. తాజాగా సమంత తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ కింద ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమం ఇటీవలే ఘనంగా జరిగింది. ఇందులో సమంతతో పాటు దిగంత్, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించగా, సీనియర్ నటి గౌతమి, మంజుషా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను రాజ్ నిడుమోరు, హిమాంక్ దువ్వూరుతో కలిసి సమంత నిర్మిస్తున్నారు.
Also Read : Betting App Case : బెట్టింగ్ యాప్ కేసులో.. నేడు CID సిట్ ముందుకు నటుడు ప్రకాశ్ రాజ్
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
ఇక సినిమాలతో పాటు సమంత వ్యాపార రంగంలో కూడా వేగంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆమె ‘Saaki’ పేరుతో క్లాతింగ్ బ్రాండ్‌ను విజయవంతంగా నడుపుతోంది. ఆ తర్వాత పెర్ఫ్యూమ్ బిజినెస్‌లో అడుగు పెట్టిన సామ్, ఇప్పుడు మరోసారి కొత్త వెంచర్‌ను ప్రారంభించింది. తాజాగా సమంత ‘Truly Sma’ అనే కొత్త క్లాతింగ్ బ్రాండ్‌ను లాంచ్ చేసింది. ఈ సందర్భంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రమో వీడియోను షేర్ చేస్తూ, “A New Chapter Begins” అనే క్యాప్షన్ ఇచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, సినీ ప్రముఖులు సమంతకు శుభాకాంక్షలు తెలుపుతూ .. “సామ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా సక్సెస్ అవ్వాలి”, “Truly Samantha స్టైల్ ఎప్పుడూ యూనిక్‌గా ఉంటుంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొత్త వ్యాపార ప్రయాణం మొదలెట్టిన సమంత ఇప్పుడు నిజంగానే ఒక ‘Truly Sma’ మోడ్‌లో ఉన్నట్టుంది!
తాజావార్తలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
-
BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్‌పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
-
CM Chandrababu : రూ.13.85 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
-
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?