Samantha: టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మాయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెల్సిందే. గత కొన్నిరోజుల నుంచి ఆమె ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకొంటుంది. దీంతో ఆమె నటించిన యశోద మూవీ ప్రమోషన్స్ వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. తన ఆరోగ్యం బాగోలేక పోయినా నిర్మాతలు తన వలన నష్టపోకూడదని సామ్ ఈ పరిస్థితిలో కూడా ప్రమోషన్స్ కు వస్తానని చెప్పిందట.. చెప్పడమే కాకుండా బయటికి వచ్చి ఇదుగో ఇలా ఫోటో షూట్ తో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
చికిత్స అనంతరం మొదటిసారి సామ్ కెమెరా ముందుకు వచ్చింది. అయితే ఈ ఫోటోలలో సామ్ ముఖం మొత్తం మారిపోయినట్లు కనిపిస్తోంది. ముఖం మొత్తం పీక్కుపోయి, నీరసంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే ముఖంలో కళ తప్పిందని చెప్పుకొస్తున్నారు. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో రెస్ట్ తీసుకోకుండా ప్రమోషన్స్ ఎందుకు..? ప్రాణం కంటే సినిమా ఎక్కువా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే యశోద సినిమా నవంబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
