Samantha: బ్యూటీ ఇన్ బ్లాక్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆడియన్స్ అందరు హీరోయిన్స్ కి లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ఇచ్చేయరు. ఒకప్పుడు సావిత్రమ్మ, ఆ తర్వాత విజయశాంతి, ఈ ఇద్దరి తర్వాత అనుష్క శెట్టి, ఇక ఇప్పుడు సమంతా. వీళ్లకి మాత్రమే లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ వచ్చింది. హీరోలు లేకుండా సినిమాని తమ భుజాలపై మోయ్యగల సత్తా ఉన్న ఈ లేడీ సూపర్ స్టార్స్ తమకంటూ ఒక సెపరేట్ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నారు. వీరిని చూడడానికి ఆడియన్స్ థియేటర్స్ కి వస్తున్నారు. మిగిలిన ముగ్గురిలో సమంతా మాత్రమే ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ ని సోలోగా మైంటైన్ చేస్తోంది. ఇప్పటివరకూ సౌత్ కి మాత్రమే పరిమితం అయిన సమంతా ‘శాకుంతలం’ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తోంది. నార్త్ హీరోయిన్స్ కి సౌత్ లో మార్కెట్ లేదు, తమిళ మలయాళ హీరోయిన్స్ కి నార్త్ లో మార్కెట్ లేదు. అటు నార్త్, ఇటు సౌత్ ని బాలన్స్ చేస్తూ అడుగులు వేస్తున్న సమంతా ‘హాలీవుడ్’లో కూడా వెబ్ సీరీస్ చేస్తోంది. తన మార్కెట్ ని హ్యూజ్ గా ఎక్స్పాండ్ చేస్తున్న సమంతా అందుకు శాకుంతలం సినిమానే ఫస్ట్ స్టెప్ గా భావిస్తున్నట్లు ఉంది.
అనారోగ్యం నుంచి కంప్లీట్ గా రికవర్ అయిన సమంతా ఏప్రిల్ 14న విడుదల కానున్న శాకుంతలం సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చెయ్యడానికి రెడీ అయ్యింది. రిలీజ్ కి మరో మూడు వారాలు మాత్రమే ఉండడంతో శాకుంతలం సినిమా ప్రమోషన్స్ ని పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేశారు. ఈ ప్రమోషన్స్ కి కిక్ స్టార్ట్ ఇస్తూ సమంతా సోషల్ మీడియాలో మూడు ఫోటోలు పోస్ట్ చేసింది. బ్యూటీ ఇన్ బ్లాక్ అనిపించే రేంజులో ఉన్న ఫోటోస్ లో సామ్ బ్యూటీఫుల్ గా ఉంది. స్టైలిష్ గా ఉన్న సామ్, త్వరలో ప్రియాంక చోప్రాని ముంబైలో కలవనుంది. హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ ప్రమోషన్స్ కోసం సమంతా, ప్రియాంక చోప్రా కలవనున్నారు. ప్రియాంక చోప్రా లాంటి ఇంటర్నేషనల్ ఇమేజ్ ఉన్న స్టార్, శాకుంతలం గురించి మాట్లాడితే నార్త్ లో ఆ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో సామ్, ప్రియాంక చోప్రాల మీటింగ్ సమంతా మార్కెట్ మరింత పెంచే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ 28న అవెంజర్స్ డైరెక్టర్స్ క్రియేట్ చేసిన ‘సిటాడెల్’ సీరీస్ నుంచి మొదటి రెండు ఎపిసోడ్స్ అమెజాన్ ప్రైమ్ లో ప్రిమియర్ కానున్నాయి.
Also Read
- Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
- NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
- Celebrity Marriage: తమ్ముడితో హీరోయిన్గా నటించి.. అన్నను పెళ్లాడిన భామలు వీరే! ఈ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే?
- Samantha: సమంత బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. ‘సామ్రాజ్’పై సామ్ ఆన్సర్ వైరల్!
https://twitter.com/Samanthaprabhu2/status/1638085389452816384
తాజావార్తలు
-
Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
-
Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
-
NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
-
Tuesday Rasi Phalalu: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!