NTV Telugu Site icon

Samantha: బహుమతుల కోసం ప్రార్ధించలేదు.. బలం కోసం ప్రార్ధించా

Sam

Sam

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ నిండా వివాదాలు, విషాదాలే ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. విమర్శలు, అవమానాలను లెక్కచేయకుండా తన జీవితాన్ని తాను గడపడానికి ప్రయత్నిస్తుంది సామ్. ఏ మాయ చేశావే అంటూ తెలుగుతెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక అక్కినేని కుర్రాడితో ప్రేమలో పడి.. అందరిని ఒప్పించి పెళ్లి చేసుకుంది. ముచ్చటగా నాలుగేళ్లు కూడా కాకుండానే భర్తతో విబేధాలు అంటూ విడాకులు ఇచ్చి బయటికి వచ్చేసింది. అదుగో అక్కడ మొదలయ్యింది ఈ విమర్శల పర్వం. తప్పు ఎవరిది అనేది చెప్పడం ఎవరి వలన కాదు. కానీ, ఎవరికి ఉండే అభిమానులు వారికి ఉన్నారు. సామ్ తప్పు చేసింది అని చై అభిమానులు.. చై తప్పు చేసాడని సామ్ అభిమానులు కొన్నేళ్లుగా కొట్టుకుంటూనే ఉన్నారు. ఇక ఇదంతా ఎప్పుడు ముగుస్తుంది అనుకొనేలోపు.. మరో పెద్ద తుఫాన్ తో వచ్చి పడింది సామ్. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఇక సినిమాలు, షూటింగ్స్, మంచి ఫుడ్, ఫిట్ నెస్ అన్ని ఆపేసి చికిత్సల కోసం దేశదేశాలు తిరిగింది. ఎట్టకేలకు దేవుడి దయవలన ఇప్పుడిప్పుడే ఈ చిన్నది కోలుకుంటుంది. అయితే తాజాగా సామ్ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టుకొచ్చింది. నేటితో ఆమె మయోసైటిస్ వ్యాధిబారిన పడి ఏడాది కావొస్తుంది. ఆ విషయాన్ని ఆమె తెలుపుతూ ఈ ఏడాదిలో ఎంత మానసిక సంఘర్షణకు గురైందో చెప్పుకొచ్చింది. చర్చ్ లో ఆమె ప్రార్థనలు చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది.

Upasana: ప్రెగ్నెంట్ అయ్యానని మొదటిసారి చరణ్ కు చెప్తే.. అలా అన్నాడు

” వ్యాధి నిర్ధారణ జరిగి ఒక సంవత్సరం అయింది. ఈ యేడాదిని ఎంతో బలవంతంగా ముగించాను. నా శరీరంతో ఎన్నో పోరాటాలు చేశాను. ఉప్పు, పంచదార లేని ఫుడ్ తిన్నాను.. ఎంతో మత్తుతో కూడిన మందులు వేసుకున్నాను. ఎప్పటికప్పుడు బలవంతంగా జీవితాన్ని రీస్టార్ట్ చేస్తూనే వచ్చాను. నన్ను నేను చూసుకొని, ఆత్మ పరిశీలన చేసుకున్న ఏడాది ఇది. ఇక కెరీర్ పరంగా కూడా ఎన్నో పరాజయాలు చవిచూశాను. ఇక వీటి కోసం ఎన్నో ప్రార్థనలు, పూజలు చేశాను. అయితే ప్రార్థనలు దేవుడ్ని బహుమతులు ఇవ్వమనో.. ఆశీర్వాదాలు ఇవ్వమనో కాదు.. నాకు ధైర్యాన్ని, బలాన్ని, మనశ్శాంతిని ఇవ్వమని ప్రార్ధించాను. అన్ని వేళలా కాలం నీది కాదు అని నేర్పిన ఏడాది ఇది. ముఖ్యంగా.. నేను కంట్రోల్ చేయాల్సినవి మాత్రమే కంట్రోల్ చేయాలి.. మిగిలినవి వదిలేయాలి. ఒక్కోసారి రిస్క్ అయినా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉండాలి. అయితే ఆ అడుగు కొన్నిసార్లు విజయం అందుకోవడం కోసం కాదు.. ముందుకు సాగడానికి మాత్రమే. అలా ముందుకు సాగడం కూడా ఒక విజయమే అని ఈ ఏడాది నాకు నేర్పింది. కొన్ని విషయాల గురించి ఆలోచించుకుంటూ కూర్చోకూడదు..గతంలోలా గొణుక్కుంటూ ఉండకూడదు. నా ప్రేమను, నన్ను ఇష్టపడేవారిని వెతకాలి. నన్ను ప్రభావితం చేసే శక్తిని ద్వేషించకూడదు. మీలో చాలా మంది కష్టతరమైన యుద్ధాలు చేస్తూ ఉంటారు. నేను మీ కోసం కూడా ప్రార్థిస్తున్నాను.దేవతలు ఆలస్యం చేయవచ్చు, కానీ వారు ఎప్పుడూ తిరస్కరించరు. శాంతి, ప్రేమ, ఆనందం మరియు శక్తిని కోరుకునే వారికి వారు ఎప్పుడూ నిరాకరించరు. కేవలం మీరు అర్హులా లేదా అనేది మాత్రమే చూస్తారు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు.. నీకు మరింత ధైర్యాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.