NTV Telugu Site icon

Samantha: మరోసారి ప్రేమలో పడిన సామ్.. ఈసారి ఆంక్షలు కూడా

Sam

Sam

Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఖుషీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. సెప్టెంబర్ 1 న ఖుషీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సామ్.. సినిమాలకు ఒక ఏడాది గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. వెండితెరపై కనిపించప్పటికీ.. ప్రమోషన్స్ లో సామ్ మెరుస్తుంది. ఇంకోపక్క సోషల్ మీడియా లో కూడా ఈ చిన్నది యమా యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఇక నిత్యం ఇన్స్టాగ్రామ్ లో ఆమె తన మనసుకు తోచిన భావాలను ఫోటోల రూపంలో కానీ, కోట్స్ రూపం లో కానీ పెడుతూ ఉంటుంది. వాటికి అర్దాలు ఏవైనా కానీ, ఆమె మనసులో ఉన్నది మాత్రం అభిమానులకు నిక్కచ్చిగా చెప్పుకొస్తుంది. ఇక నాగ చైతన్యతో విడిపోయాక సామ్ ఎంతో వేదన అనుభవించింది. ప్రస్తుతం ఆ వేదన నుంచి బయటికి వస్తుంది. దీనికోసం సామ్ కొత్త ప్రేమను వెతుకుతుంది.

Chithha: చిత్తాగా వస్తున్న సిద్దార్థ్.. ఈసారి గట్టిగా కొట్టేలానే ఉన్నాడే

తాజాగా తనకు ఒక కొత్త ప్రేమ దొరికిందని సామ్ చెప్పడం నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఎవరు ఆ వ్యక్తి అంటూ అభిమానులు ఆసక్తి కనపరిచారు. అయితే సామ్ ప్రేమలో పడింది వ్యక్తితో కాదు నీటితో. అవును మెరుస్తున్న నీటిలో నా కొత్త ప్రేమను కనుగున్నాను అని సామ్ చెప్పుకొచ్చింది.ఒక గ్లాస్ లో ఐస్ ముక్కలు వేసిన వాటర్ ను చేత్తో పట్టుకొని .. ” మెరిసే నీటిలో నా కొత్త ప్రేమను కనుగున్నాను. కొత్త ఆంక్షలతో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి” అంటూ లవ్ ఎమోజిస్ ను యాడ్ చేసింది. ఇక దీంతో ఫ్యాన్స్.. సామ్ నీ మనసు.. ఆ స్వచ్ఛమైన నీటితో సమానం. నీకు దేవుడు దైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Show comments