NTV Telugu Site icon

Samantha: ఆ అవకాశం వస్తే మాత్రం వదలొద్దు…సమంత పోస్ట్ వైరల్

Samantha Instagram

Samantha Instagram

Samantha Instagram post about own company goes viral: సమంత రుత్ ప్రభు ప్రస్తుతం న్యూయార్క్ లో తెగ ఎంజాయ్ చేస్తోంది. మయోసైటిస్ వ్యాధి చికిత్స కోసం సామ్ అక్కడికి వెళ్లినట్లు వార్తలు అయితే వస్తున్నాయి. ఇక న్యూయార్క్ 41వ భార‌త స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొని… అక్కడి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. విదేశీ వీధుల్లో తిరుగుతూ వరుస ఫోటో షూట్స్ చేస్తూ… ఫ్యాన్స్ కు గ్లామర్ ట్రీట్ కూడా ఇస్తోంది. ఇక ఇదిలా ఉండగా సామ్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ స్టోరీ పోస్ట్ చేసింది. ఇక ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ స్టోరీలో సమంత… నెటిజన్స్ కు ఓ ఉపదేశం చేసింది. అందులో మీకు ఎప్పుడైనా అవకాశం వస్ మాత్రం ఒంటరిగా వెళ్లండి…. ఒంటరిగా నడవండి… ఒంటరిగా ప్రయాణించండి… ఒంటరిగానే జీవించండి… ఒంటరిగా డాన్స్ చేయండి…. అంటూ రాసుకొచ్చింది.

Prakash Raj: చంద్రయాన్ 3 సక్సెస్.. ఈయనకు ఎక్కడో మండుతున్నట్లు ఉంది

ఇక మీకు గనుక అవకాశం వస్తే… ప్రపంచం కోరుకునేలా కాకుండా మీలా ఉండడానికి ప్రయత్నించండి అంటూ సలహా ఇచ్చింది. చాలా మందికి ఎవరైనా తమ పక్కన నిలబడితేనే ఎలా నిలబడాలో తెలుసు.. అయితే అది మీ కథ కాదు… మీకు అవకాశం వచ్చినప్పుడు ఒంటరిగా నడవండి… ఒంటరిగా నడిచే అవకాశం ఒక అరుదైన గిఫ్ట్ అని తెలుసుకోండి.. అంటూ హిత బోధ చేసింది. ఇది మీ జీవిత గమనాన్ని మార్చగల అంతర్దృష్టిని మీకు అందజేస్తుందని వెల్లడించింది. అయితే సమంత పోస్టుపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. అసలు ఈ పోస్టు ఎందుకు పెట్టారు.. ఎవరినీ ఉద్దేశించి పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మయోసైటిస్ తో బాధపడుతూ… సామ్ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నందున ఇలా పెట్టి ఉంటుందని భావిస్తున్నారు. ఇక సమంత విషయానికి వస్తే.. ప్రస్తుతం న్యూయార్క్ లో వెకెషన్ ఎంజాయ్ చేస్తోంది. సామ్ విజయ్ దేవరకొండ కలిసి నటించిన ఖుషి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ.

Samantha Insta