NTV Telugu Site icon

మరో ఐటెంసాంగ్ లో సమంత.. ?

samantha

samantha

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అని లేకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టేసింది. ఇక ఇటీవల ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ లో మెరిసిన ఈ బ్యూటీ.. ఊ అంటావా ఊఊ అంటావా అంటూ ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసింది. ఇక మరోసారి అమ్మడు ఐటెం సాంగ్ కి సిద్దమైందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. పూరి- విజయ్ దేవరకొండ కాంబోలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘లైగర్’ సినిమాలో సామ్ ఐటెం సాంగ్ చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ సాంగ్ కోసం సామ్ గట్టిగానే పారితోషికం తీసుకోనున్నదట.

స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపిస్తున్నాడు. విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. పూరి ఐటెం సాంగ్స్ అంటే ఎలా ఉంటాయో మాటల్లో చెప్పక్కర్లేదు. ఊర మాస్ హీరో.. మాస్ మసాలా లిరిక్స్ తో మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా ఉంటాయి. ఇక పుష్ప సాంగ్ తో సామ్ మాస్ లుక్స్, అందచందాలతో అదరగొట్టింది. ఇక విజయ్ దేవరకొండ పక్కన, పూరి డైరెక్టన్ లో సామ్ సాంగ్ అంటే అంతకు మించి ఉంటుందని అర్ధం అవుతుంది. అయితే ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాలి అంటే మేకర్స్ నోరువిప్పాల్సిందే..