NTV Telugu Site icon

Samantha : బాలీవుడ్ హీరోతో వెబ్ సిరీస్ కు సమంత గ్రీన్ సిగ్నల్

Samantha

Samantha

తెలుగు వాళ్లైనా బాలీవుడ్ ను ఏలేస్తున్న దర్శక, నిర్మాతల ద్వయం రాజ్ అండ్ డీకే. సినిమా మీద పాషన్ తో నార్త్ బెల్ట్ లోకి అడుగుపెట్టి మంచి మంచి సినిమాలు, సిరీస్ లను అందిస్తున్నారు. ఫ్యామిలీమెన్, ఫర్జీ, గన్స్ అండ్ గులాబ్స్, రీసెంట్లీ వచ్చిన సీటాడెల్ లాంటి వెబ్ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమాలతో కన్నా సిరీస్ లతోనే ఎక్కువ ఫేమస్సైన రాజ్ అండ్ డీకే మరో యాక్షన్ ఫ్యాక్డ్ వెబ్ సిరీస్ తీసుకు వస్తున్నారు.

Also Read : Shruti Haasan : హాలీవుడ్‌లోకి శృతి హాసన్.. రాణించేనా..?

గత ఏడాది ఎనౌన్స్ చేసిన రక్త్ బ్రహ్మాండ్: ద బ్లడీ కింగ్ డమ్ సెట్స్ పైకి వెళ్లిపోయింది. తుంబడ్ ఫేమ్ రాహి అనిల్ బార్వే దర్శకుడు. సమంత నటిస్తోన్న ఈ సిరీస్ లో ఆషికీ 2, ఓకే జాను ఫేం ఆదిత్య రాయ్ కపూర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. గతంలో నైట్ మేనేజర్ తో ఓటీటీ ప్రేక్షకులను పలకరించిన ఆదిత్య రక్త బ్రహ్మాండ్ కోసం ఒళ్లు హునం చేసుకుంటున్నాడట. సీటాడెల్ నుండి వస్తున్న రక్త బ్రహ్మాండ్ కూడా యాక్షన్ ఫ్యాక్డ్ వెబ్ సిరీస్ గా రాబోతుంది. హై ఓల్డేజ్ యాక్షన్ సీన్లలో నటించాల్సిన నేపథ్యంలో కత్తి యుద్దం, మార్షల్ ఆర్ట్స్ వంటి వాటిల్లో శిక్షణ తీసుకుంటున్నాడు. కాగా, ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తైనట్లు తెలుస్తోంది. గతంలో సమంత కూడా ఫ్యామిలీ మెన్ 2, సీటాడెల్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆదిత్య కూడా కసరత్తులు చేస్తున్నాడట. ఇందులో మీర్జాపూర్ ఫేం ఆలీ ఫజల్, వామికా గబ్బీ కూడా కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ ఏడాదే ఈ సిరిస్ ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్.