NTV Telugu Site icon

Samantha: చిన్మయి పిల్లలను కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్న సమంత

Sam

Sam

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన సామ్.. కాలంతో సాగుతోంది. తనకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడడానికి మానసికంగా సంసిద్ధం అవుతుంది. ఇందుకోసం ఆమె మనసుకు నచ్చింది చేస్తోంది. వెకేషన్స్, ఫ్రెండ్స్.. పిల్లలు.. కుక్కలు ఇలా తనకు నచ్చిన పనులు చేస్తూ ఉల్లాసంగా ఉంటుంది. ఇక నిన్నటివరకు ఫ్రెండ్ అనూష స్వామి తో కలిసి సామ్ వెకేషన్ ఎంజాయ్ చేసిన సామ్.. నేడు తన బెస్ట్ ఫ్రెండ్ చిన్మయి ఇంట్లో సేదతీరుతూ కనిపిస్తుంది. సామ్, చిన్మయి ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామ్ దేహం అయితే చిన్మయి ఆత్మ అని చెప్పొచ్చు. అలా వీరిద్దరూ కలిసి ఉండేవారు. చిన్మయినే కాకుండా ఆమె భర్త రాహుల్ కూడా సామ్ కు మంచి స్నేహితుడు. దీంతో నిత్యం సామ్.. వారితోనే సమయం గడుపుతూ ఉంటుంది.

Chiranjeevi: నా తమ్ముడిని బయటకు వెళ్ళమనడానికి నువ్వు ఎవడ్రా?. చిరు వార్నింగ్

తాజాగా సామ్.. రాహుల్ పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న వీడియోలను షేర్ చేసింది. రాహుల్, చిన్మయి ప్రేమించి పెళ్లి చేసుకోగా.. వారికి కవల పిల్లలు ఉన్నారు. ఇక వారితో ఆడుతూ సామ్ ఈ ప్రపంచాన్ని సైతం మర్చిపోయింది. వారిని పట్టుకోవడానికి సామ్ చాలా కష్టపడుతున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. ఇక ఈ వీడియోలను పోస్ట్ చేస్తూ.. “ఇప్పుడు వీరి కిడ్నాప్‌కి ప్లాన్ ఎలా వేయాలి” అంటూ క్యాప్షన్ పెట్టుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వీడియోస్ చూసిన అభిమానులు అన్ని బావుంది ఉంటే .. సామ్ కూడా తన చిన్నారులతో ఇలా ఆడుకుంటూ ఉండేది అని కామెంట్స్ పెడుతున్నారు.