Site icon NTV Telugu

మూడు యూట్యూబ్ ఛానళ్లపై సమంత పరువు నష్టం దావా

Samantha files defamation on 3 Youtube Channels

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా నాగ చైతన్యతో విడాకుల విషయమై వార్తల్లో నిలుస్తోంది. సామ్, నాగ చైతన్య విడాకుల విషయం ప్రకటించినప్పుడే తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దు అంటూ మీడియాను, సోషల్ మీడియాను, అభిమానులను కోరారు. కానీ సోషల్ మీడియాలో అవేమీ పట్టించుకోకుండా సామ్ పై నెగెటివ్ ప్రచారం బాగా జరిగింది. తన స్టైలిస్ట్ తో ఎఫైరే చైతో విడాకులకు కారణమని, పిల్లల వద్దనుకుందని వివిధ రకాలుగా వార్తలు వచ్చాయి. వాటన్నింటిపైనా స్పందించిన సామ్ ఇన్స్టా పోస్ట్ ద్వారా ఆవేదనను వ్యక్తం చేస్తూ ఇలా చేస్తే ఊరుకోబోయేది లేదని హెచ్చరించింది కూడా.

Read also : పవన్ షాకింగ్ డెసిషన్… సినీ ప్రియులకు మరోసారి నిరాశ

అయినప్పటికీ కొన్ని యూట్యూబ్ చానళ్ళు, వెబ్సైట్లు హద్దుమీరి ఆమె జీవితంలోకి తొంగి చూడడంతో సమంత కోర్టును ఆశ్రయించింది. తన పరువుకు భంగం కలిగేలా వ్యవహించారంటూ మూడు యూట్యూబ్ చానల్స్ పై సమంత పరువు నష్టం దావా వేసింది. అందులో సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీ ఉన్నాయి. కాసేపట్లో కూకట్ పల్లి కోర్టులో దీనిపై విచారణ జరగనుంది. మరి కోర్టు ఈ విషయంపై ఎలాంటి తీర్పును ఇస్తుందో చూడాలి.

Exit mobile version