పవన్ షాకింగ్ డెసిషన్… మరోసారి అభిమానులకు నిరాశ తప్పదా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. పొలిటికల్ ఎంట్రీ అనంతరం సినిమాలను దూరం పెట్టిన పవన్ ‘వకీల్ సాబ్’తో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా భారీ కలెక్షన్స్ రాబట్టింది. ‘వకీల్ సాబ్’తో పాటు ఆయన వరుసగా మేకర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, ‘హరిహర వీరమల్లు’, ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమాలు చేస్తున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డితో మరో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలన్నీ చిత్రీకరణ దశలో ఉన్నాయి. అయితే పవన్ సినిమాల్లోకి మళ్ళీ రావడంతో సంతోషంగా ఉన్న మెగా ఫ్యాన్స్ కు తాజా సమాచారం ఓ చేదు వార్త.

Read Also : ప్రభాస్ బర్త్ డే… అభిమానులకు ‘మిర్చి’ ట్రీట్

ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో చాలా చురుకుగా ఉన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. జనసేనాని తన రాజకీయ పార్టీని నడపడానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో విన్పిస్తున్న టాక్ ప్రకారం పవన్ ఇకపై సినిమాలకు సంతకం చేయకూడదని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి సినిమాల నుంచి బ్రేక్ తీసుకోనున్నారు. 2023 నుంచి రాబోయే ఎన్నికలపై దృష్టి సారించాలని భావిస్తున్నారట. మరి ఈసారైనా ఏపీ ఎన్నికల్లో పవన్ జగన్ ప్రభుత్వానికి గట్టి పోటీ ఇస్తారేమో చూడాలి.

Related Articles

Latest Articles