Site icon NTV Telugu

Kushi: ఖుషి ఖుషిగా సమంత.. అమెరికాలో సరికొత్త రికార్డు!

Samantha Instagram

Samantha Instagram

Samantha Creates a new Record with Kushi 1 Million Dollar Collections in USA: విజయ్ దేవరకొండ , సమంత కాంబోలో శివ నిర్వాణ తెరకెక్కించిన లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఖుషి.సెప్టెంబర్ 1న పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మొదటి రెండు రోజుల్లోనే 51 కోట్ల గ్రాస్ ని వసూళ్లు చేసింది. అంటే 25 కోట్ల షేర్ ని రాబట్టింది. ఇండియాలోనే కాకుండా యూఎస్, కెనడాలో కూడా భారీ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. విజయ్ ఇమేజ్ కి సమంత స్టార్‌డమ్ యాడ్ అవ్వడంతో అమెరికాలో 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది ఖుషి. అన్ని వెబ్‌సైట్‌లలో బెస్ట్ రివ్యూస్ ని అందుకుంది. అయితే సమంత నటించిన 16 సినిమాలు యూఎస్ లో 1 మిలియన్ మార్క్ దాటాయి.

Chandramukhi 2 Trailer: ఇది చంద్రముఖిలా లేదు… ఎదో సినిమా చూసినట్లు ఉంది

ఖుషి ఆ మార్క్ దాటిన 17వ ప్రాజెక్ట్ కావడంతో ఆమె సరికొత్త రికార్డు సెట్ చేసింది. .ఈ సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తోంది సమంత. ప్రజెంట్ అమెరికాలో ఉన్న ఈ బ్యూటీ అక్కడి ప్రేక్షకుల్ని కలిసి కృతజ్ఞతలు తెలిపింది. ఖుషి సినిమాకి ఆదివారం బుకింగ్స్ చాలా బాగున్నాయి. వీకెండ్ కాబట్టి జోరు కొనసాగడం సహజమే కానీ సోమవారం నుంచి డ్రాప్ ఎంత శాతం ఉంటుంది అనేది కీలకం. సెప్టెంబర్ 7న జవాన్ వస్తున్న నేపథ్యంలో ఆడియన్స్ దృష్టి అటు వైపు వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే కుటుంబ ప్రేక్షకులు మాత్రం ఖుషి వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యేనాటికి 80 కోట్ల గ్రాస్ వసూళ్లు చేస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ అనలిస్టులు. సమంత నటించిన 17 చిత్రాలూ అమెరికాలో ‘మిలియన్ డాలర్’ క్లబ్లోకి చేరడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version