NTV Telugu Site icon

Samantha: విరామం అనేది చెడ్డ విషయం కాదు.. సామ్ పోస్ట్ వైరల్

Sam

Sam

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమాలను పూర్తిచేసి అమ్మడు ఒక ఏడాదిపాటు సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నదని తెల్సిన విషయమే. ఇక ప్రస్తుతం సామ్.. తెలుగులో ఖుషీ సినిమాలో నటిస్తుండగా.. హిందీలో సిటాడెల్ సిరీస్ చేస్తోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సిరీస్ అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సిరీస్ ను పూర్తిచేసి సామ్ రెస్ట్ తీసుకోనుందని తెలియడంతో అభిమానులు కొద్దిగా నిరాశ చెందారు. సిటాడెల్.. ఇంకొన్ని రోజులు షూటింగ్ చేసుకుంటే బావుండు అని కోరుకున్నారు. అయితే.. సామ్ మాత్రం పట్టుదలగా సిటాడెల్ షూటింగ్ ను పూర్తిచేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా అభిమానులకు తెలిపింది. సిటాడెల్ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఏమి జరుగుతుందో మీకు తెలిసినప్పుడు విరామం అనేది చెడ్డ విషయంగా అనిపించదు.

Nayakudu: రజినీ, కమల్ మెచ్చిన ‘నాయకుడు’..

రాజ్ అండ్ డీకే, సీతా ఆర్ మీనన్ నాకు తెలియని కుటుంబం.. కానీ, నాకు అవసరం అనిపిస్తుంది. నా ప్రతి ఒక్క యుద్ధంలో పోరాడటానికి మీరు చేసిన సహాయానికి నేను దన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎప్పుడు మీరు నన్ను వదలలేదు. ప్రపంచంలోని అన్నింటికంటే మిమ్మల్ని గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నాను..నాకు జీవితాంతం గుర్తుండిపోయేలా పాత్ర ఇచ్చినందుకు థాంక్స్. అంటే.. అలాంటి పాత్ర మరొకటి మీరు రాసే వరకు..” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో సామ్ .. బ్రేక్ కు సిద్దమవుతుందట. అసలు బ్రేక్ అంటే అమ్మడు ఎక్కడికి వెళ్తోంది. అసలు ఈ ఏడాది కనిపించదా.. ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరి ప్రమోషన్ల మాట ఏమిటి.. ? అని అభిమానులు ఆరాలు తీస్తున్నారు.