స్టార్ హీరోయిన్ సమంత మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కినేని నాగ చైతన్య కు విడాకులు ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చిన అమ్మడు మరోసారి అభిమానులను షాక్ కి గురిచేయనున్నట్లు తెలుస్తోంది . ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సామ్ తొందర్లో సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పనుందంట. ట్విట్టర్ నుంచి వైదొలిగే ప్రయత్నంలో సామ్ ఉన్నట్లు రూమర్స్ గుప్పంటున్నాయి. విడాకుల విషయం దగ్గరనుంచి నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు.
చై తో విడిపోవడానికి ఆమె కారణమంటూ ఇష్టం వచ్చినట్లు ఆమెను తిట్టిపోశారు. అయితే ఈ ట్రోల్స్ పై సామ్ ప్రత్యేక్షంగా స్పందించకపోయిన పరోక్షంగా చురకలు అంటిస్తునే ఉంది. అయినా నెటిజన్ల తాకిడి ఆగకపోవడంతో ఆమె కొద్దిరోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండనున్నారని సమాచారం. ఇలా చేస్తే అవతలి వాళ్ల ఎమోషన్స్ తో సంబంధం లేకుండా పెట్టే కామెంట్ల నుంచి విముక్తి దొరుకుతుందని, అందుకే సమంత ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుందని వినికిడి. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
