Site icon NTV Telugu

Samajavaragamana: రెండు రోజుల ముందే సామజవరాగమన ప్రీమియర్స్.. బూస్ట్ ఇచ్చే టాక్!

Samajavaragama Movie

Samajavaragama Movie

Samajavaragamana Premieres : మాములుగా అయితే సినిమాకు ముందు రోజో లేక రెండు రోజుల ముందో మీడియాకు, సినీ ప్రముఖులకు సినిమా యూనిట్లు తమ సినిమాల ప్రీమియర్స్‌ వేస్తుంటాయి. అయితే ఈ మధ్యన కొన్ని సినీ బృందాలు ప్రేక్షకులకూ పెయిడ్ ప్రీమియర్స్‌ చూసే అవకాశం కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో ‘సామజవరగమన’ కొందరు ప్రేక్షకులు తమ సినిమాని ముందుగా చూసేందుకు వీలు కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రధాన నగరాల్లో సోమవారం సాయంత్రం 7 గంటల 30 ని.లకు ప్రీమియర్స్ వేశారు. ‘ఫ్యామిలీ ఫస్ట్‌ ప్రీమియర్‌’ పేరిట ఈ ప్రీమియర్లు ప్రదర్శించారు. ఇక తెలంగాణలోని హైదరాబాద్ లో ఈరోజు ప్రీమియర్ ని ప్లాన్‌ చేసింది. శ్రీవిష్ణు హీరోగా దర్శకుడు రామ్‌ అబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమాలో రెబా మోనికా జాన్‌ హీరోయిన్ గా నటించింది.

Rakesh Master Last Video: చనిపోయే ముందు రాకేశ్ మాస్టర్ రికార్డు చేసిన సెల్ఫి వీడియో!

నరేశ్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించగా కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఇక ఈ సినిమాకి బూస్ట్ ఇచ్చే విధంగా ప్రముఖ హీరో చిరంజీవి ఆదివారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు. అంతేకాక ఈ సినిమా మంచి విజయం అందుకోవాలని కూడా మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు. తమ సినిమా పై నమ్మకంతో నిన్న జూన్ 26న పలు చోట్ల స్పెషల్ ప్రీమియర్ షోస్ ప్లాన్ చేయగా వాటికి అదిరే రెస్పాన్స్ వచ్చాయని, అన్ని షోస్ కూడా హౌస్ ఫుల్ అయ్యాయని మేకర్స్ చెప్తున్నారు. ఈ అదిరే రెస్పాన్స్ తో తమ సినిమా రిలీజ్ పై మంచి నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version