Samajavaragamana Collections: ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సామజవరగమన’ జూలై 29న విడుదలైంది. ఈ సినిమా ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ కామెడీ మూవీ అని టాక్ రావడంతో సినిమాకు కలెక్షన్ల వరద కురుస్తోంది. శ్రీ విష్ణు హీరోగా ‘వివాహ భోజనంబు’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేశ్ దండా ఈ సినిమాను నిర్మించారు. వినోద ప్రధానంగా సాగిన ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటున్నారు. రెబా మోనికా జాన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘు బాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, ప్రియ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం సమకూర్చగా గురువారం నాడు ఈ సినిమా రిలీజ్ అయింది. శ్రీ విష్ణు సామజవరగమన మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా ఓవర్సీస్ లో చూపించిన గ్రోత్ తెలుగు రాష్ట్రాల్లో చూపించ లేక పోతోంది.
Om Raut Responds: ఆదిపురుష్ ట్రోలింగ్స్ పై స్పందించిన ఓం రౌత్.. నేను చేసిన తప్పల్లా ఇదే?
ఆసక్తికరమైన విషయం ఏంటంటే వసూళ్ళలో మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ వసూలు చేయగా మూడో రోజు మరిన్ని వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 1.17 కోట్ల షేర్ దక్కించుకుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా కూడా ఎక్స్ లెంట్ గా జోరు చూపించిన ఈ సినిమా ఏకంగా 1.72 కోట్ల రేంజ్ లో షేర్ ని 3.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని రచ్చ లేపింది. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుంది, 3.50 కోట్ల రేంజ్ టార్గెట్ గా బరిలోకి దిగిన ఈ సినిమా మూడు రోజులకి 40 లక్షల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమా ఇక లాంగ్ రన్ లో మరింత జోరు చూపించి భారీ లాభాలను అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. ‘సామజవరగమన’ రోజురోజుకూ వసూళ్లు పెంచుకుంటూ ముందుకు వెళుతోంది. సినిమాకి కంటెంటే కింగ్ అని మరోసారి ఈ సినిమాతో నిరూపించబడింది, అర్బన్ మరియు ఓవర్సీస్ రెండింటిలోనూ అద్భుతమైన రన్ సాధిస్తోంది. విపరీతమైన డిమాండ్ కారణంగా, అనేక నగరాల్లో థియేటర్ల సంఖ్య విస్తరించారు. ట్రెండ్ ప్రకారం, ఈ సినిమా శ్రీవిష్ణు కెరీర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.