Site icon NTV Telugu

Sam Bahadur: సామీ… ఈ సినిమాని కాస్త వాయిదా వేసుకోవచ్చు కదా… డిపాజిట్లు కూడా వచ్చేలా లేవు

Sam Bahadur

Sam Bahadur

డిసెంబర్ 1న నార్త్ ఆడియన్స్ ముందుకి రానున్నాయి అనిమల్ అండ్ సామ్ బహదూర్ సినిమాలు. ఈ రెండు సినిమాల జానర్స్ వేరు, కంటెంట్స్ వేరు, ఆర్టిస్టులు వేరు, వీటిని చూసే ఆడియన్స్ సెక్టార్ వేరు. నిజానికి ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే వచ్చే నష్టమేమి లేదు. థియేటర్స్ పర్ఫెక్ట్ గా దొరికితే చాలు కావాల్సిన కలెక్షన్స్ వచ్చేస్తాయి. అయితే ఈసారి మాత్రం బాలీవుడ్ వార్ వన్ సైడ్ అయ్యేలా ఉంది. డిసెంబర్ 1న అనిమల్ సినిమా దెబ్బకి సామ్ బహదూర్ మూవీ ఇబ్బందులు ఫేస్ చేసేలా కనిపిస్తోంది. అనిమల్ మూవీ రన్ టైమ్ ఎక్కువ, A రేటెడ్, వయొలెన్స్ ఎక్కువ అయినా కూడా ఈ మూవీకి వెళ్లడానికే ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవలే బయటకి వచ్చిన అనిమల్ ట్రైలర్… సినిమాపై విపరీతంగా ఇంట్రెస్ట్ ని పెంచింది.

ఇంత హైప్ ఉన్న సినిమా ముందు సామ్ బహదూర్ రిలీజ్ కావడం అనేది మంచి విషయం కాదు. ఒక మంచి సినిమా ఎక్కువ మంది ఆడియన్స్ కి రీచ్ కాకుండా ఉంటుంది. ఒకవేళ అనిమల్ సినిమా ఫ్లాప్ అయితే సామ్ బహదూర్ మూవీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ అనిమల్ టాక్ అండ్ హైప్ చూస్తుంటే అలా అనిపించట్లేదు. అనిమల్ వేవ్ లో సామ్ బహదూర్ సినిమాకి సరైన ఓపెనింగ్స్ కూడా వచ్చేలా కనిపించట్లేదు. ఇలాంటి సమయంలో విక్కీ కౌశల్ అండ్ టీమ్ రిస్క్ తీసుకోకుండా సామ్ బహదూర్ సినిమాకి ఒకటి రెండు రోజులు వాయిదా వేసుకోవడం బెటర్. మరి సామ్ బహదూర్ మేకర్స్ ఈ ఆలోచన చేస్తారా లేక డేర్ చేసి అనిమల్ కి పోటీగా తమ సినిమాని రిలీజ్ చేస్తారా అనేది చూడాలి.

Exit mobile version