Site icon NTV Telugu

Tantra: వామ్మో.. సలోని.. ఇలా భయపెడుతోంది.. ఏంటి?

Tantra Saloni Look

Tantra Saloni Look

Saloni Look From Tantra Movie: ‘ధన 51’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సలోని. ‘మర్యాద రామన్న’, ‘బాడీగార్డ్‌’ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించింది. కెరీర్లో ఎక్కువగా పక్కింటి అమ్మాయి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె తరువాత కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. ‘రేసుగుర్రం’ సినిమాలో అల్లు అర్జున్ వదిన పాత్రలో మెప్పించిన ఆమె తెలుగు సినిమాలకు కొంత గ్యాప్‌ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఆమె ‘తంత్ర’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. అనన్య నాగళ్ల ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘తంత్ర’ సినిమాలో సలోని ఓ కీలక పాత్ర పోషించనుందని చెబుతున్నారు. ఫస్ట్‌ కాపీ మూవీస్‌, బి ద వే ఫిల్మ్స్‌, వైజాగ్ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీనివాస్‌ గోపిశెట్టి అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్‌ను నిర్మాణ సంస్థ విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

King of Kotha: కొత్తా, కోతా.. తెలుగులోళ్ళు మరీ ఇంత చులకనైపోయారా బాసూ?

భయంకరమైన క్షుద్రశక్తులు అనన్యని పీడిస్తున్నట్టుగా కనపడుతున్న పోస్టర్‌ ఆసక్తి రేపగా నటుడు శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్‌ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఇక తాజాగా సలోని లుక్స్ కొన్ని రిలీజ్ చేసిన దర్శనిర్మాతలు మాట్లాడుతూ ఫీమేల్‌ ఓరియెంటెడ్‌ లైన్‌తో రూపొందుతున్న హారర్‌ ఎంటర్‌టైనర్‌ తంత్ర, భారతీయ తాంత్రిక శాస్త్రం, పురాణగాథల నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుందని అన్నారు. తంత్ర శాస్త్రానికి చెందిన విస్తుగొలిపే రహస్యాలను ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నాం అని అనన్య నాగళ్లతో పాటు సలోని కీ రోల్‌ పోషిస్తున్నారని అన్నారు. గ్లామర్‌ పాత్రలతో మెప్పించిన సలోని ఇందులో డిఫరెంట్‌గా కనిపిస్తారని, ఆమెది నటనకు ఆస్కారమున్న పాత్ర అని అన్నారు. ఇటీవల అనన్యా, సలోని, హీరోపై కీలక సన్నివేశాలను చిత్రీకరించామని, ఆ అవుట్‌పుట్‌బాగా వచ్చిందని అన్నారు. అవి చూశాక ఈ సినిమా టీమ్‌ అందరికీ మంచి పేరు తీసుకురావడంతోపాటు సలోనికి మంచి కమ్‌బ్యాక్‌ అవుతుంది’’ అని తెలిపారు.

Exit mobile version