బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ నుంచి వచ్చిన ఎన్ని సినిమాలు డిజాస్టర్ అయినా రాబోయే కొత్త సినిమాపై అదే రేంజులో ఎక్స్పెక్టేషన్స్ ఉండడం మాములే. ఈసారి అయినా సల్మాన్ హిట్ కొడతాడా ఫాన్స్ అండ్ ట్రేడ్ వర్గాలు ఆశగా ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ మాట అన్ని సినిమాలకి వర్తిస్తుందేమో కానీ అసలు ఎలాంటి అనుమానం లేకుండా ఈసారి సల్మాన్ నటించబోయే సినిమా సూపర్ హిట్ అని అందరూ నమ్మే మూవీ ‘టైగర్ 3’. యష్ రాజ్ స్పై యునివర్స్ నుంచి ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ ఫ్రాంచైజ్ గా పేరు తెచ్చుకున్న టైగర్ సీరీస్ నుంచి వస్తున్న థర్డ్ సినిమా ‘టైగర్ 3’. ఈ మూవీ షూర్ షాట్ ఇండస్ట్రీ హిట్ అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది. నవంబర్ 10న ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి టైగర్ 3 ఆడియన్స్ ముందుకి రానుంది.
రిలీజ్ డేట్ లాక్ అవ్వడంతో టైగర్ 3 ప్రమోషన్స్ కి కిక్ స్టార్ట్ చేసిన మేకర్స్… బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ ని వదులుతూనే ఉన్నారు. ప్రమోషన్స్ లో మరింత జోష్ రావాలి అంటే టైగర్ 3 ట్రైలర్ బయటకి రావాలి. సల్మాన్ ఫాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న ఈ ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. అక్టోబర్ 16న టైగర్ 3 ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ టైగర్ 3 ట్రైలర్ తో సినిమా ప్రమోషన్స్ కి సూపర్ కిక్ ఇవ్వనున్నారు. యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ తో సాలిడ్ బజ్ జనరేట్ చేస్తే టైగర్ 3 ఓపెనింగ్స్ రికార్డ్ బ్రేకింగ్ స్థాయిలో ఉంటాయి. సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కూడా టైగర్ 3 ట్రైలర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ట్రైలర్ రిలీజ్ అవ్వడం ఆలస్యం డిజిటల్ రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయ్యి కొత్త హిస్టరీ క్రియేట్ అవ్వడం గ్యారెంటీ. టైగర్ 3 ట్రైలర్ వ్యూస్ లో సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేయడం గ్యారెంటీ. ట్రైలర్ మాత్రమే కాదు టైగర్ 3 సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల లెక్క వెయ్యి కోట్ల నుంచి మొదలవుతుంది.
Excitement levels hone waale hain out of hand 📈📈 kyunki aa raha hai #Tiger3Trailer iss 16th OCTOBER! #5DaysToTiger3Trailer #Tiger3 arriving in cinemas this Diwali. Releasing in Hindi, Tamil & Telugu. #YRF50 | #YRFSpyUniverse pic.twitter.com/8oUehY3pqc
— Yash Raj Films (@yrf) October 11, 2023