Salman Khan: సోషల్ మీడియాని టేకోవర్ చేసుకోనున్న ‘టైగర్’…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ నుంచి వచ్చిన ఎన్ని సినిమాలు డిజాస్టర్ అయినా రాబోయే కొత్త సినిమాపై అదే రేంజులో ఎక్స్పెక్టేషన్స్ ఉండడం మాములే. ఈసారి అయినా సల్మాన్ హిట్ కొడతాడా ఫాన్స్ అండ్ ట్రేడ్ వర్గాలు ఆశగా ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ మాట అన్ని సినిమాలకి వర్తిస్తుందేమో కానీ అసలు ఎలాంటి అనుమానం లేకుండా ఈసారి సల్మాన్ నటించబోయే సినిమా సూపర్ హిట్ అని అందరూ నమ్మే మూవీ ‘టైగర్ 3’. యష్ రాజ్ స్పై యునివర్స్ నుంచి ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ ఫ్రాంచైజ్ గా పేరు తెచ్చుకున్న టైగర్ సీరీస్ నుంచి వస్తున్న థర్డ్ సినిమా ‘టైగర్ 3’. ఈ మూవీ షూర్ షాట్ ఇండస్ట్రీ హిట్ అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది. నవంబర్ 10న ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి టైగర్ 3 ఆడియన్స్ ముందుకి రానుంది.
రిలీజ్ డేట్ లాక్ అవ్వడంతో టైగర్ 3 ప్రమోషన్స్ కి కిక్ స్టార్ట్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. ప్రమోషన్స్ కి సూపర్ స్టార్ ఇవ్వాలి అంటే టైగర్ 3 టీజర్ బయటకి రావాలి. సల్మాన్ ఫాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న ఈ టీజర్ ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. సల్మాన్ ఫాన్స్ లో ఇంకాస్త జోష్ నింపడానికి టైగర్ టీజర్ రిలీజ్ డేట్ లాక్ అయ్యింది. సెప్టెంబర్ 27న టైగర్ 3 టీజర్ ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ టైగర్ 3 టీజర్ తో సినిమా ప్రమోషన్స్ ని గ్రాండ్ గా స్టార్ట్ చేయనున్నారు. యాక్షన్ ప్యాక్డ్ టీజర్ తో సాలిడ్ బజ్ జనరేట్ చేస్తే టైగర్ 3 ఓపెనింగ్స్ రికార్డ్ బ్రేకింగ్ స్థాయిలో ఉంటాయి. సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కూడా టైగర్ 3 టీజర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి టీజర్ రిలీజ్ అవ్వడం ఆలస్యం డిజిటల్ రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయ్యి కొత్త హిస్టరీ క్రియేట్ అవ్వడం గ్యారెంటీ. సో టైగర్ 3 టీజర్ వ్యూస్ లో సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేయడం గ్యారెంటీ.
Also Read
- Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
- ‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
- Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
- Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
తాజావార్తలు
-
Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
-
Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
-
OTR: హాట్ కామెంట్స్ నుంచి సైలెంట్ మోడ్‌కు పోచారం
-
PM Modi: బీజేపీ కొత్త టీమ్‌తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
-
Dandruff: డాండ్రఫ్ మళ్లీ మళ్లీ వస్తోందా? మీ తప్పు కాకపోవచ్చు.. కారణం ఇదే!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!