Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Salman Khan Summoned By Andheri Court For Alleged Assault On A Tv Journalist

Salman Khan : చిక్కుల్లో భాయ్… తెరపైకి జర్నలిస్ట్ పై దాడి కేసు

Published Date :March 23, 2022 , 2:06 pm
By Prakash
Salman Khan : చిక్కుల్లో భాయ్… తెరపైకి జర్నలిస్ట్ పై దాడి కేసు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Salman Khan మరోమారు న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాడు. సల్మాన్ ఖాన్ కు బాలీవుడ్ లో ఎంతటి క్రేజ్ ఉందో అంతే తరచుగా వివాదాల్లో కూడా చిక్కుకుంటూ ఉంటాడు. తాజాగా జర్నలిస్ట్ పై సల్మాన్ దాడి కేసుతెరపైకి వచ్చింది. 2019లో జరిగిన ఈ వివాదానికి సంబంధించి ఓ జర్నలిస్టు చేసిన ఫిర్యాదుపై నటుడు సల్మాన్ ఖాన్, ఆయన బాడీ గార్డ్ నవాజ్ షేక్‌లకు అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు ​​జారీ చేసింది. వీరిద్దరిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్‌ 504 (శాంతి భంగం కలిగించే ఉద్దేశంతో ఉద్దేశ్యపూర్వకంగా అవమానించడం), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదైనట్లు పోలీసు నివేదికలో పేర్కొన్నట్లు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్‌ఆర్ ఖాన్ మంగళవారం తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. న్యాయస్థానం సమన్లు ​​జారీ చేసి తదుపరి విచారణను ఏప్రిల్ 5కి వాయిదా వేసింది. సల్మాన్ ఖాన్, షేక్‌లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ అశోక్ పాండే తన ఫిర్యాదులో కోరారు.

Read Also : Boycott RRR in Karnataka : అవమానం అంటూ కన్నడిగుల ఆగ్రహం… మేకర్స్ కు షాక్

అసలు ఆ దాడి సంగతేంటంటే… 2019 ఏప్రిల్ 24న ముంబై వీధిలో సల్మాన్ సైకిల్‌పై వెళుతుండగా కొందరు మీడియా వ్యక్తులు ఆయన ఫోటోలను తీశారట. అదే సమయంలో ఫోటోలు తీస్తున్న తన మొబైల్ ఫోన్‌ను పగలగొట్టిన సల్మాన్ అక్కడే వాగ్వాదానికి దిగి, తనను బెదిరించాడని పాండే తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని డీఎన్ నగర్ పోలీసులను కోర్టు గతంలో ఆదేశించింది. ఇక కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చిన ఈ కేసు ఇప్పుడు విచారణకు వచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే… ప్రస్తుతం సల్మాన్ గాడ్ ఫాదర్, టైగర్ 3, కభీ ఈద్ కభీ దీపావళి వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andheri court
  • God Father
  • Salman assault on a TV journalist
  • Salman Khan
  • Salman Khan Controversy

తాజావార్తలు

  • Telangana Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి

  • Lucky Heroine : ఫ్లాప్ హీరోలు ఆమెతో సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నారు

  • Samsung Galaxy Z Fold 8: సాంసంగ్ ‘వైడ్’ ఫోల్డబుల్ 5G ఫోన్.. 7.6 అంగుళాల స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో

  • Ram Pothineni: నటుడి నుంచి రచయితగా.. రామ్ పోతినేని సరికొత్త ప్రయోగం!

  • Virat Kohli Fans: మీ అభిమానం తగలేయ్య!!.. పేరెంట్స్ కోహ్లీకి బిగ్ ఫ్యాన్స్.. కుమారుడికి ఏం పేరు పెట్టారో చూడండి..

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions