Site icon NTV Telugu

Salman Khan: ప్రమాదకమైన వ్యాధి.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా

Salman Khan

Salman Khan

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ పర్ఫెక్ట్ ఫిట్ నెస్ మెయింటైన్ చేసే ఈ హీరో ఒక ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నాడట. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా అందరిముందు చెప్పడం ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఫిట్ నెస్ విషయంలో నిత్యం రాజీపడని సల్మాన్ ని బాధపెడుతున్న ఆ వ్యాధి పేరు.. ‘ట్రిజెమినల్ న్యూరల్జియా’. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర వ్యాధుల్లో ఇది ఒకటని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే.. నరాల సమస్య వల్ల కలిగే ఈ వ్యాధి వల్ల ఎక్కువ సేపు మాట్లాడితే మూతి వంకర్లు పోతుంది.. దానివలన ముఖం చాలా నొప్పిని భరించలేకుండా వుంటుందట.

ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో సల్మాన్‌ తన వ్యాధి గురించి బయటపెట్టాడు. ” ఈ వ్యాధి వలన నేను నరకం అనుభవిస్తున్నాను. ఎక్కువసేపు మాట్లాడలేక పోయేవాడిని..ముఖం అంతా బాగా నొప్పి వచ్చేది .. మూతి వంకర్లు పోయి మాట్లాడడం కూడా కష్టమయ్యేది. బ్రష్‌ చేసుకున్న, మేకప్‌ వేసుకున్న నొప్పి తీవ్రంగా ఉండేది. కొన్నిసార్లు ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. కానీ ఇప్పుడిప్పుడే నేను ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్నాను. ఈ వ్యాధికి అమెరికాలో చికిత్స తీసుకొంటున్నాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సల్మాన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. పైకి కండల వీరుడు గా కనిపిస్తున్నా లోపల ఎంతటి బాధను అనుభవిస్తున్నాడో సల్లు భాయ్ అని అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version