Site icon NTV Telugu

Tiger 3: పఠాన్, జవాన్ రికార్డ్స్ కి చెక్ పెట్టిన టైగర్…

Tiger 3

Tiger 3

పఠాన్, జవాన్, గదర్ 2 సినిమాలో 2023లో బిగ్గెస్ట్ గ్రాసర్స్ గా నిలిచాయి. బాలీవుడ్ బిజినెస్ ని పూర్తిగా రివైవ్ చేసిన ఈ సినిమాలు ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. ఇక 2023లో ఈ సినిమాలదే టాప్ ప్లేస్ అనుకుంటుంటే… సల్మాన్ ఖాన్ సాలిడ్ గా బయటకి వచ్చాడు. గత కొంతకాలంగా సరైన హిట్ లేని సల్మాన్ ఖాన్, టైగర్ 3 సినిమాతో కంబైక్ ఇస్తాడని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ టైగర్ 3 ట్రైలర్ ని వదిలాడు సల్మాన్ ఖాన్. యష్ రాజ్ స్పై యూనివర్స్ కి స్టార్టింగ్ పాయింట్ అయిన టైగర్, జోయా కథకి నార్త్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇండియన్ స్పై, పాకిస్థాన్ స్పై ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనే దగ్గర మొదలైన టైగర్ ఫ్రాంచైజ్ నుంచి ఇప్పుడు మూడో సినిమాగా టైగర్ 3 వస్తుంది. గతంలో వచ్చిన రెండు సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యాయి.

ఇప్పుడు టైగర్ 3 పఠాన్ జవాన్, గదర్ 2 సినిమాలని దాటి ఈ ఇయర్ హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుందని సమాచారం. ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లో 41 మిలియన్ వ్యూస్, 1.5 మిలియన్ లైక్స్ వచ్చాయి అంటే టైగర్ 3 పై ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. రిపీట్ మోడ్ లో ట్రైలర్ ని చూస్తూ వ్యూస్ పెంచుతున్నారు సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్. హ్యుజ్ సెటప్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఏ స్పై సినిమాలో అయినా ఉంటాయి కానీ టైగర్ ఫ్రాంచైజ్ లో మాత్రమే హ్యూమన్ ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. మరోసారి దాన్ని నిజం చేయడానికి నవంబర్ 12న టైగర్ 3 రిలీజ్ కానుంది. మరి సల్మాన్ దెబ్బకి ఎన్ని రికార్డులు లేస్తాయో చూడాలి.

Exit mobile version