Prasanth Neel: ఆయనలా సినిమాలు ఎవరు తీయలేరు.. సలార్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prasanth Neel: ఎంత పెద్ద హీరో అయినా.. హీరోయిన్ అయినా.. డైరెక్టర్ అయినా వారి వారి వ్యక్తిగత ఇష్టాలు వారికి ఉంటాయి. వారిని ఇన్స్పైర్ చేసినవారు.. వారికి నచ్చిన డైరెక్టర్స్, హీరోస్ వారికి ఉంటారు. అలానే మన సలార్ డైరెక్టర్ కు కూడా ఆల్ టైమ్ ఫేవరేట్ డైరెక్టర్ ఒకరు ఉన్నారట. నీల్ మావ ఇష్టపడే డైరెక్టర్ అంటే.. ఏ హాలీవుడ్ డైరెక్టరో.. లేక మన జక్కన్న పేరో చెప్తారు అనుకుంటే పొరపాటే.. ప్రశాంత్ నీల్ ఆల్ టైమ్ ఫేవరేట్ డైరెక్టర్.. ఎవరో కాదు ఉపేంద్ర అంట. మీరు విన్నది నిజమే.. ఉపేంద్ర హీరోగానే కాదు .. దర్శకుడుగా కూడా ఎన్నో హిట్ సినిమాలు తెరకెక్కించాడు. కన్నడ ఇండస్ట్రోలొ ఆయనో పెద్ద సూపర్ స్టార్. ఏ, రా, ఉపేంద్ర సినిమాలకు తెలుగులో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ఇక ఆయన డైరెక్షన్ తనకు నచ్చుతుందని ప్రశాంత్ నీల్ చెప్పడం ఆకట్టుకుంటుంది . ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్.. తనకు నచ్చిన హీరో, హీరోయిన్, డైరెక్టర్ గురించి చెప్పుకొచ్చాడు.
” నేను కన్నడ షో అని చెప్పడం లేదు. నాకు ఉపేంద్ర గారి డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. ఆయనే నా ఆల్ టైమ్ ఫేవరేట్ డైరెక్టర్. ఏ భాషలోనైనా నా ఆల్ టైమ్ ఫేవరేట్ డైరెక్టర్ అంటే ఉప్పీ సర్ పేరే చెప్తాను. ఆయన సినిమా తీసే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయనలా సినిమాలు తీయడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన తెరకెక్కించిన సినిమాలు కొన్ని చూస్తే .. అసలు ఎలా తీయగలిగాడు ఇలా అని అనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన నటిస్తూ తెరకెక్కిస్తున్న యూఐ సినిమా కోసం వేచి చూస్తున్నాను. ఇక నాకు నచ్చిన హీరో అంటే అమితాబ్ బచ్చన్. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఇక హీరోయిన్స్ లో శ్రీదేవి నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. ఆమె కు నేను ఎప్పటికి కూడా అభిమానిగా ఉంటాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ 31 సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
Also Read
- Ajay Bhupathi: "శ్రీనివాస మంగాపురం" ఆడియో బ్లాక్‌బస్టర్ హిట్ కాబోతోంది: డైరెక్టర్ అజయ్ భూపతి
- Save The Tigers Season 3: ఆ ముగ్గురు మొగుళ్ల పంచాయితీలోకి ‘వెన్నెల కిషోర్’.. ‘సేవ్ ది టైగర్స్ 3’ లో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్!
- Kushboo Sundar: ఖుష్బూ ఇంట పెళ్లి సందడి.. కాబోయే కొత్త జంటకు పీఎం మోడీ ఆశీస్సులు!
- Bobby Deol: వైభవ్ బ్యాటింగ్‌కు ‘యానిమల్’ విలన్ ఫిదా.. 'దేవుడా ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడు'!
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..