Site icon NTV Telugu

Prasanth Neel: ఆయనలా సినిమాలు ఎవరు తీయలేరు.. సలార్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్

Uppi

Uppi

Prasanth Neel: ఎంత పెద్ద హీరో అయినా.. హీరోయిన్ అయినా.. డైరెక్టర్ అయినా వారి వారి వ్యక్తిగత ఇష్టాలు వారికి ఉంటాయి. వారిని ఇన్స్పైర్ చేసినవారు.. వారికి నచ్చిన డైరెక్టర్స్, హీరోస్ వారికి ఉంటారు. అలానే మన సలార్ డైరెక్టర్ కు కూడా ఆల్ టైమ్ ఫేవరేట్ డైరెక్టర్ ఒకరు ఉన్నారట. నీల్ మావ ఇష్టపడే డైరెక్టర్ అంటే.. ఏ హాలీవుడ్ డైరెక్టరో.. లేక మన జక్కన్న పేరో చెప్తారు అనుకుంటే పొరపాటే.. ప్రశాంత్ నీల్ ఆల్ టైమ్ ఫేవరేట్ డైరెక్టర్.. ఎవరో కాదు ఉపేంద్ర అంట. మీరు విన్నది నిజమే.. ఉపేంద్ర హీరోగానే కాదు .. దర్శకుడుగా కూడా ఎన్నో హిట్ సినిమాలు తెరకెక్కించాడు. కన్నడ ఇండస్ట్రోలొ ఆయనో పెద్ద సూపర్ స్టార్. ఏ, రా, ఉపేంద్ర సినిమాలకు తెలుగులో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ఇక ఆయన డైరెక్షన్ తనకు నచ్చుతుందని ప్రశాంత్ నీల్ చెప్పడం ఆకట్టుకుంటుంది . ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్.. తనకు నచ్చిన హీరో, హీరోయిన్, డైరెక్టర్ గురించి చెప్పుకొచ్చాడు.

” నేను కన్నడ షో అని చెప్పడం లేదు. నాకు ఉపేంద్ర గారి డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. ఆయనే నా ఆల్ టైమ్ ఫేవరేట్ డైరెక్టర్. ఏ భాషలోనైనా నా ఆల్ టైమ్ ఫేవరేట్ డైరెక్టర్ అంటే ఉప్పీ సర్ పేరే చెప్తాను. ఆయన సినిమా తీసే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయనలా సినిమాలు తీయడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన తెరకెక్కించిన సినిమాలు కొన్ని చూస్తే .. అసలు ఎలా తీయగలిగాడు ఇలా అని అనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన నటిస్తూ తెరకెక్కిస్తున్న యూఐ సినిమా కోసం వేచి చూస్తున్నాను. ఇక నాకు నచ్చిన హీరో అంటే అమితాబ్ బచ్చన్. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఇక హీరోయిన్స్‌ లో శ్రీదేవి నాకు ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌. ఆమె కు నేను ఎప్పటికి కూడా అభిమానిగా ఉంటాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ 31 సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

Exit mobile version