కెజియఫ్ చాప్టర్ 2 ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలనాలు క్రియేట్ చేసిందో తెలుసు కదా. ఏకంగా 1200 కోట్లకు పైగా రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇండియన్ టాప్ 5 మూవీస్‌లో ఒకటిగా నిలిచింది కెజియఫ్. మరి ఇలాంటి సినిమాను తలదన్నేలా ప్రశాంత్ నీల్, సలార్‌ను తెరకెక్కిస్తున్నాడా? అంటే, ఔననే అంటున్నారు. కెజియఫ్ తర్వాత బిగ్ స్కేల్‌తో భారీ బడ్జెట్‌తో సలార్‌ను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు హోంబలే ఫిలింస్ వారు. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో సలార్ సినిమాటోగ్రాఫర్ భువన గౌడ.. సలార్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సలార్ ఫస్ట్ సినిమా ఉగ్రమ్ నుంచి సలార్ వరకు ఈయనే సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. ఈ ఇద్దరి కాంబినేష్‌న్లో వస్తున్న నాలుగో సినిమా ఇది.
సలార్ కెజియఫ్ స్కేల్ కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చాడు భువన గౌడ. ‘అసలు సలార్‌కు KGFకి సంబంధం లేదు.. ట్రైలర్ చూసి సినిమాను అంచనా వేయలేరు. సలార్‌లోని ఫైర్-లైట్ విజువల్స్ KGFని పోలి ఉంటాయి. కానీ KGF సెట్‌లో సలార్ షూట్ చేయలేదు. సలార్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ అండ్ టీమ్ 100 ఎకరాల్లో భారీ సెట్‌లు రూపొందించారు. అదనంగా, దండుమైలారంలో హాప్ కిలోమీటరు గోడ మరియు 100 ఎకరాలలో భారీ సెట్లను నిర్మించాము. నా లెక్క ప్రకారం.. సలార్ స్కేల్ KGF కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. టెక్నికల్‌గా వేరే లెవల్ అనేలా సలార్‌ను తెరకెక్కించాము.. అని చెప్పుకొచ్చాడు. మరి రోజు రోజుకి అంచనాలను పెంచేస్తున్న సలార్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
