NTV Telugu Site icon

Salaar Dunki: రివేంజ్ ఏంట్రా… రికార్డ్స్‌ లేస్తాయ్!

Prabhas Srk

Prabhas Srk

ప్రభాస్ అంటే ఎవరు? ఒకప్పుడు తెలుగులో సినిమాలు చేసుకునే ఓ హీరో. మరి షారుఖ్ ఖాన్ దశాబ్దాలకు దశాబ్దాలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో. అలాంటి హీరోతో ప్రభాస్ పోటీ ఏంట్రా? అని కొందరు బాలీవుడ్ జనాల మాట. కరెక్టే మరి… అలాంటప్పుడు ప్రభాస్ సినిమా వస్తుందంటే ఎందుకు వణికిపోతున్నారు? అనేది సౌత్ ఆడియెన్స్ మాట. ఎందుకంటే.. అక్కడుంది బాహుబలికి ముందు ఉన్న ప్రభాస్ కాదు… వేల కోట్ల బాక్సాఫీస్ కింగ్. ఫ్లాప్ టాక్‌తోనే వందల కోట్లు రాబట్టగల పాన్ ఇండియా కటౌట్. ఒక్క బాహుబలికే బెదిరిపోతున్నారంటే… ఆ తర్వాత వచ్చిన సినిమాలు హిట్ అయి ఉంటే ఇంకెలా ఉండేదో. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ ఫ్లాప్ అయ్యాయి. పఠాన్, జవాన్ బ్యాక్ టు బ్యాక్ వెయ్యి కోట్లు రాబట్టాయి. అలాంటప్పుడు ఫ్లాప్ హీరో వస్తే.. హిట్ హీరోకి భయమెందుకు? పైగా ఇట్స్ రివేంజ్ టైం అంటూ.. సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. డైనోసర్‌ని కింగ్ ఖాన్ చిత్తు చేసినట్టుగా పోస్టులు చేస్తున్నారు షారుఖ్ ఫ్యాన్స్.

రివేంజ్ అంటే, ప్రభాస్ మీద కాదు… ప్రశాంత్ నీల్ మీదట. ఎందుకంటే కెజియఫ్ చాప్టర్ వన్‌ను షారుఖ్ ‘జీరో’ సినిమాకు పోటీగా రిలీజ్ చేసి నెగ్గాడు ప్రశాంత్ నీల్. ఇక ఇప్పుడు కావాలనే షారుఖ్‌కు పోటీగా సలార్ రిలీజ్ చేస్తున్నాడు కానీ ఇక్కడుంది అప్పటి షారుఖ్ కాదు.. రెండు వేల కోట్ల హీరో.. ప్రశాంత్ నీల్ పై రివేంజ్ తీర్చుకునే టైం వచ్చేసింది. ఈ దెబ్బకు మళ్లీ షారుఖ్‌తో పోటీ పడకుండా చేస్తామనే.. కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే అక్కడుంది మాస్ మొనగాళ్లు… ప్రభాస్‌కు అసలైన మాస్ బొమ్మ పడితే ఎలా ఉంటుందో.. సలార్‌తో చూపించేందుకు వస్తున్నాడు ప్రశాంత్ నీల్. పెద్దగా ఎవ్వరికీ తెలియనప్పుడే యష్‌తో వెయ్యి కోట్లు రాబట్టాడు. అలాంటిది.. ఇప్పుడు మాస్ కా బాప్ తో కలిసి వస్తున్నాడు.. అలాంటప్పుడు డే వన్ నుంచే రికార్డ్స్ లేస్తాయ్ అని సలార్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి సలార్ వర్సెస్ డంకీ వార్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి.

Show comments