Salaar: ఎట్టకేలకు ప్రభాస్ ఫ్యాన్స్ కల నెరవేరింది. సలార్ ట్రైలర్.. సలార్ ట్రైలర్ అంటూ వెయ్యి కళ్ళతో ఎదురుచూసారు. కొద్దిసేపటి క్రితమే ఆ ఎదురుచూపులు ఫుల్ స్టాప్ పెడుతూ సలార్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కెజిఎఫ్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ .. ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు ఇక ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. దేవా, వరద రాజమన్నార్ . ఇద్దరు ప్రాణ స్నేహితులు.. వరద రాజులూ కోసం దేవా ఏదైనా చేస్తాడు. వరదను ముట్టుకోవాలంటే దేవాను దాటి వెళ్ళాలి. అయితే.. చిన్నతనంలోనే దేవా, వరద విడిపోతారు. కానీ, దేవా వెళ్లేముందు .. వరదకు ఒక మాట ఇస్తాడు. నీకు సాయం కావలనప్పుడు ఎలా ఉన్నా వస్తాను అంటాడు.
Payal Ghosh: ఎన్టీఆర్ హీరోయిన్.. ఈసారి గౌతమ్ గంభీర్ గుట్టు రట్టు చేసిందే
ఇక వరద సామ్రాజ్యములో తన తండ్రి తరువాత స్థానం తనకు రాకుండా విలన్స్ కుట్ర పన్నుతారు. ఎవరికి వారు పెద్ద పెద్ద సైన్యాలను తెచ్చుకుంటారు. అప్పుడు వరద ఒంటరి వాడు అవుతాడు. ఆ సమయంలో అతడికి సైన్యంగా నిలుస్తాడు దేవా.. ఫ్రెండ్ కోసం ఒక్కడే.. మిగిలినవారిని మట్టుబెట్టి.. వరద సామ్రాజ్యాన్ని దక్కేలా చేస్తాడు. ఇది సలార్ కథ అనుకుంటే.. ఇలాంటి కథ ఎక్కడో విన్నట్టే ఉందే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అదే ఉగ్రం. దానికి దర్శకుడు కూడా ప్రశాంత్ నీల్ నే. ఇదే అతడి మొదటి సినిమా. ఇద్దరు ఫ్రెండ్స్.. ఒక ఫ్రెండ్ కోసం ఇంకో ఫ్రెండ్ వచ్చి ఎలాంటి యుద్ధం చేసాడు అనేది ఉగ్రం కథ. సలార్ ట్రైలర్ చూస్తుంటే.. అటుఇటుగా అదే కథను తీసుకొచ్చారని కొందరు అంటున్నారు. మొదటి భాగంలో ఫ్రెండ్స్ గా ఉన్న వీరు.. రెండో భాగంలో శత్రువులుగా మారతారని అంటున్నారు. ఈ పార్ట్ మొత్తం దేవా, వరదరాజమన్నార్ స్నేహం ఉంటుందని తెలుస్తోంది. మొదటి నుంచి కూడా ప్రశాంత్ నీల్ ఉగ్రం నుంచే లీడ్ తీసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పుకురావడం కూడా ఇందుకు కారణం అయ్యి ఉండొచ్చు. మరి సేమ్ ఉగ్రం కథను దింపారా.. ? సలార్ లో మార్పు ఏమైనా చేశారా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
