Salaar Trailer: రికార్డులు క్రియేట్ చేయడానికి వస్తున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నమోదైన రికార్డ్స్ కి ఎండ్ కార్డ్ వేసి, కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయడానికి సలార్ వస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్-పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ‘సలార్’ సినిమా డిసెంబర్న 22న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రస్తుతం రిలీజ్ కానున్న సినిమాల్లో సలార్ మైంటైన్ చేస్తున్న హైప్, ఏ ఇండియన్ సినిమాకి లేదు. ప్రభాస్ ఫేస్ కూడా రివీల్ చేయకుండా కట్ చేసిన గ్లిమ్ప్స్ కి 24 గంటల్లో 83 మిలియన్ వ్యూస్ వచ్చాయి అంటే సలార్ పై అంచనాలు ఏ రేంజులో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఈ అంచనాలని ఆకాశాన్ని తాకేలా చేయడానికి సలార్ ట్రైలర్ బయటకి రాబోతుంది. సలార్ రిలీజ్ కి మూడు వారాల సమయం మాత్రమే ఉంది కాబట్టి ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతున్నారు హోంబలే మేకర్స్. నిజానికి సలార్ సినిమాపై ఉన్న అంచనాలకి ప్రమోషన్స్ అంతగా చేయాల్సిన అవసరం లేదు.
ఇప్పటికిప్పుడు థియేటర్స్ లో సలార్ సినిమాని రిలీజ్ చేసినా, టాక్ కాస్త బాగుంటే చాలు ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుంది. సినిమాపై మేకర్స్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అందుకే ఉన్న రెండు సాంగ్స్ ని కూడా హోల్డ్ చేసి డైరెక్ట్ గా ట్రైలర్ ని రంగంలోకి దించుతున్నారు. సెప్టెంబర్ 6న సలార్ ట్రైలర్ బయటకి రానుందని సమాచారం. ఇక్కడే ఒక సర్ర్పైజింగ్ విషయం ఉంది… సలార్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి రాఖీ భాయ్ యష్ గెస్టుగా రానున్నాడని కర్ణాటక మీడియాలో వినిపిస్తున్న టాక్. ఒకే ఈవెంట్ లో ప్రభాస్-యష్ కలిస్తే ఆ ఈవెంట్ రీచ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరేమో డైనోసర్ ఇంకొకరేమో మాన్‌స్టర్ కాబట్టి ఈ ఇద్దరి మీటింగ్ పాయింట్ లో లాంచ్ అయితే చాలు సలార్ ట్రైలర్ ఏ డిజిటల్ రికార్డుని మిగిలించదు.
Also Read
తాజావార్తలు
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్‌కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!