డిసెంబర్ 22న పాన్ ఇండియా బాక్సాఫీస్ పై దాడి చేయడానికి డైనోసర్ సలార్ రాబోతుంది. ఈ డైనోసర్ దాడి ఏ రేంజులో ఉండబోతుందో ఇప్పటికే స్టార్ట్ అయిన బుకింగ్స్ ర్యాంపేజ్ ని చూస్తే అర్ధం అవుతుంది. రిలీజ్ కి నాలుగు రోజుల ముందు భారీ హైప్ ని మైంటైన్ చేస్తున్న సలార్ సినిమా ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ అవ్వడం గ్యారెంటీ. ఆ తర్వాత ఫైనల్ కలెక్షన్స్ ఎక్కడి వరకూ వెళ్లి ఆగుతాయి అనేది చూడాలి. ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ చెయ్యకున్నా కేవలం ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై ఉన్న నమ్మకంతో సలార్ పై హైప్ క్రియేట్ అయ్యింది. ప్రమోషనల్ ఈవెంట్స్ చెయ్యని ప్రొడక్షన్ కనీసం ప్రమోషనల్ కంటెంట్ అయినా రిలీజ్ చేస్తుంది అనుకుంటే రిలీజ్ ట్రైలర్ ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆవు పులి కథ చెప్తున్నారు.
24 గంటలుగా ఒక ట్రైలర్ కోసం ప్రభాస్ పాన్ ఇండియా ఫ్యాన్స్ ని వెయిట్ చేయిస్తోంది హోంబలే ఫిల్మ్స్. చెప్పిన టైమ్ ని ఇప్పటికే రెండు సార్లు మిస్ చేసిన హోంబలే ఫిల్మ్స్… ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి రిలీజ్ చేయాల్సిన ట్రైలర్ ని ఇంకా వదలలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియాలో అకౌంట్స్ ని ట్యాగ్ చేసి “ఏ బాబు లేవ్”, “ట్రైలర్ ఏడరా” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సలార్ రిలీజ్ ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా చెయ్యకున్నా సైలెంట్ గా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ చెప్పిన టైమ్ కి ట్రైలర్ వదలకపోవడంతో సహనం కోల్పోయారు. ఇప్పటికైనా హోంబలే ఫిల్మ్స్ సలార్ రిలీజ్ ట్రైలర్ ని బయటకి వదిలితే బాగుంటుంది.
