Site icon NTV Telugu

Salaar: కుక్కకాటుకు చెప్పుదెబ్బ.. సలార్ మేకర్స్ షాకింగ్ నిర్ణయం!

Salaar Vs Dunki

Salaar Vs Dunki

Salaar team decided not release at PVR-INOX and Miraj Properties in South: ప్రభాస్ సలార్ – షారుఖ్ ఖాన్ డుంకీ మధ్య నార్త్ లో ఉన్న జరిగిన పోటాపోటీ వాతావరణం హాట్ టాపిక్ అవుతోంది. ఘర్షణ దృష్టాంతంపై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు ఇవ్వడంలో బాలీవుడ్ హంగామా కొనసాగుతోంది. సలార్ సినిమాను పక్కన పెట్టి 100 శాతం తమ సినిమానే ప్రదర్శించాలని డంకీ టీమ్ పెద్ద ఎత్తున ప్రెజర్ పెట్టడంతో సింగిల్ స్క్రీన్ యజమానుల అసోసియేషన్ స్టాండ్ తీసుకుని శుక్రవారం డుంకీ బుకింగ్‌లను ఓపెన్ చేయడనికి నిరాకరించింది. ఇక ఇప్పుడు మరో షాకింగ్ విషయం బాటకు వచ్చింది. పెన్ మరుధర్ – డుంకీ టీం తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో సలార్ టీమ్ మల్టీప్లెక్స్ చైన్‌లకు భారీ షాక్ ఇచ్చేలా ప్లాన్ చేసింది. PVR-Inox – Miraj మల్టీప్లెక్స్ చైన్‌లలో నార్త్ అంతా ఎక్కువగా డుంకీకి స్క్రీన్స్ కేటాయిస్తున్న క్రమంలో మేకర్స్ దక్షిణ భారత మార్కెట్‌లలోని PVR-Inox – Miraj మల్టీప్లెక్స్ చైన్‌ల నుండి సాలార్ విడుదల చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు.

Pallavi Prashanth: పరారీలో పల్లవి ప్రశాంత్.. క్షమించండి అంటూ వీడియో రిలీజ్

అయితే నార్త్ లో మార్కెట్ లీడర్‌గా ఉన్న PVR-Inox తప్పుడు బిజినెస్ పద్దతుల జోలికి వెళ్ళకూడదు కానీ వారు అందుకు భిన్నంగా, బహిరంగంగా డుంకీకి అనుకూలంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. PVR-Inox – Miraj నిర్వహించే అన్ని సింగిల్ స్క్రీన్‌లలో సలార్ వద్దని డుంకీకి ఓటు వేశారు. ఈ మేరకు గత రాత్రి షారుఖ్ ఖాన్ స్వయంగా అజయ్ బిజిలీని పిలిచి ఒక లాభదాయకమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో నిర్ణయాలు జరిగాయని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి నార్త్ లో PVR-Inox మార్కెట్, అక్కడ ఫార్మాట్ నే సింగిల్ స్క్రీన్ యజమానులందరూ అనుసరిస్తారు. PVR-Inox సమంగా సలార్, డుంకీ సినిమాలకు స్క్రీన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరగడంతో షారుఖ్ జోక్యం చేసుకుని వారి నిర్ణయాన్ని మార్చుకునేలా చేశాడు. ఈ క్రమంలో అక్కడ ఏమీ చేయలేని పరిస్థితుల్లో సౌత్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

Exit mobile version