NTV Telugu Site icon

Salaar Song: ఈరోజే తుఫాన్ అనౌన్స్మెంట్… రెడీగా ఉండండి

Salaar

Salaar

ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఇండియన్ బాక్సాఫీస్ ని షాటర్ చేయడానికి వస్తుంది సలార్ సీజ్ ఫైర్ సినిమా. డిసెంబర్ 22న రిలీజ్ కానున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ప్రభాస్ క్రేజ్, ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ మేకింగ్… సలార్ సినిమాని మరింత స్పెషల్ గా మార్చాయి. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా, ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ మాస్ సినిమాగా ‘డార్క్ సెంట్రిక్ థీమ్’ వాడుతూ రూపొందింది సలార్. సరిగ్గా పది రోజుల్లో తుఫాన్ లా ఇండియన్ బాక్సాఫీస్ ని తాకనున్న ఈ సినిమా ఫస్ట్ సింగల్ ని రంగం సిద్ధమయ్యింది. చాలా రోజులుగా సలార్ సాంగ్ బయటకి వస్తుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి కానీ అఫీషియల్ అప్డేట్ మాత్రం బయటకి రావట్లేదు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్న సలార్ ఫస్ట్ సాంగ్ కి సంబందించిన అనౌన్స్మెంట్ ఈరోజు వస్తుందని మేకర్స్ నుంచి అఫీషియల్ ట్వీట్ వచ్చేసింది.

ఈరోజు సలార్ సాంగ్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అనే విషయంలో హోంబలే ఫిల్మ్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తూ ఈరోజు సాంగ్ సింగల్ కోసం హోంబలే మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్ కి ట్యూన్ అయ్యి ఉండండి అని చెప్పింది. ట్రైలర్ తో బాగా పెరిగిన అంచనాలని సలార్ సాంగ్ స్కై హైకి తీసుకోని పోవడం గ్యారెంటీ. KGF సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత బాగుంటుందో సాంగ్స్ కూడా అదే రేంజులో ఉంటాయి. తుఫాన్, సుల్తాన్, ధీర ధీర, సలామ్ రాఖీ భాయ్ సాంగ్ KGF సినిమాకి మరింత క్రేజ్ ని తెచ్చాయి. ఈ రేంజ్ ఒక్క సాంగ్ పడితే చాలు సలార్ మూవీకి రిపీట్ మోడ్ లో వినడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారు. KGF కి అదిరిపోయే సాంగ్స్ ని ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ ఇప్పుడు సలార్ విషయంలో ఆ ఫైర్ ని రిపీట్ చేస్తాడో లేదో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాలి.

Show comments