Site icon NTV Telugu

Salaar: అర్ధరాత్రి నుంచే షోలు… ఆర్ ఆర్ ఆర్ రేంజ్ రేట్లు

Salaar

Salaar

ఇప్పటికే ఓవర్సీస్‌లో సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర హాప్ మిలియన్ మార్క్ క్రాస్ చేసేసింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో… ప్రీ బుకింగ్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు యూకే, ఆస్ట్రేలియాలో కూడా సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఓవరాల్‌గా ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది సలార్. ఇక ఇండియాలో కూడా నిన్నటి నుంచి బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. దీంతో సలార్ టికెట్స్ కోసం హ్యూజ్ డిమాండ్ ఉంది. రాజమౌళి సలార్ మూవీ ఫస్ట్ టికెట్ ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా టికెట్స్ ఎక్కడ దొరుకుతాయా అని చూస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఫిక్స్ అయిపోయారు. అందుకు తగ్గట్టే… సలార్ మాస్ జాతర్ మిడ్ నైట్ నుంచే షురూ కానుందని తెలుస్తోంది.

మామూలుగా అయితే… అన్ని సినిమాల ఫస్ట్ డే ఫస్ట్ షో రిలీజ్ రోజు ఉదయం లేదంటే తెల్లవారుజామున ఉంటుంది కానీ సలార్ ఫస్ట్ షో మాత్రం అర్ధరాత్రి 12 గంటలు దాటగానే ఉంటుందని తెలుస్తోంది. డిసెంబర్ 22న సలార్ రిలీజ్ కానుండగా… డిసెంబర్ 21 అర్థరాత్రి దాటిన వెంటనే సలార్ షోలు మొదలవుతాయి కానీ అప్పటికే ఓవర్సీస్‌లో సలార్ ప్రీమియర్స్ పడిపోతాయి కాబట్టి… సలార్ పార్ట్ 1 సీజ్‌ఫైర్ రివ్యూలు ముందే బయటికి రానున్నాయి. ఆర్ ఆర్ ఆర్ రేంజ్ టికెట్ రేట్లు, అర్ధరాత్రి నుంచే షోలు ఉన్నాయి కాబట్టి సలార్ ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచే అవకాశం ఉంది. రేట్స్ అండ్ షోస్ అనే కాదు సలార్ అనేది ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమా కాబట్టి… రివ్యూలతో సంబంధం లేకుండా ఫస్ట్ డే ఓపెనింగ్స్‌తో సంచలనం క్రియేట్ చేయడం పక్కా. సలార్‌కు ఏ మాత్రం హిట్ టాక్ పడినా… బాక్సాఫీస్ దగ్గర వచ్చే వసూళ్ల సునామి మామూలుగా ఉండదు. మరి సలార్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version