Salaar: అర్ధరాత్రి నుంచే షోలు… ఆర్ ఆర్ ఆర్ రేంజ్ రేట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటికే ఓవర్సీస్‌లో సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర హాప్ మిలియన్ మార్క్ క్రాస్ చేసేసింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో… ప్రీ బుకింగ్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు యూకే, ఆస్ట్రేలియాలో కూడా సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఓవరాల్‌గా ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది సలార్. ఇక ఇండియాలో కూడా నిన్నటి నుంచి బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. దీంతో సలార్ టికెట్స్ కోసం హ్యూజ్ డిమాండ్ ఉంది. రాజమౌళి సలార్ మూవీ ఫస్ట్ టికెట్ ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా టికెట్స్ ఎక్కడ దొరుకుతాయా అని చూస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఫిక్స్ అయిపోయారు. అందుకు తగ్గట్టే… సలార్ మాస్ జాతర్ మిడ్ నైట్ నుంచే షురూ కానుందని తెలుస్తోంది.
మామూలుగా అయితే… అన్ని సినిమాల ఫస్ట్ డే ఫస్ట్ షో రిలీజ్ రోజు ఉదయం లేదంటే తెల్లవారుజామున ఉంటుంది కానీ సలార్ ఫస్ట్ షో మాత్రం అర్ధరాత్రి 12 గంటలు దాటగానే ఉంటుందని తెలుస్తోంది. డిసెంబర్ 22న సలార్ రిలీజ్ కానుండగా… డిసెంబర్ 21 అర్థరాత్రి దాటిన వెంటనే సలార్ షోలు మొదలవుతాయి కానీ అప్పటికే ఓవర్సీస్‌లో సలార్ ప్రీమియర్స్ పడిపోతాయి కాబట్టి… సలార్ పార్ట్ 1 సీజ్‌ఫైర్ రివ్యూలు ముందే బయటికి రానున్నాయి. ఆర్ ఆర్ ఆర్ రేంజ్ టికెట్ రేట్లు, అర్ధరాత్రి నుంచే షోలు ఉన్నాయి కాబట్టి సలార్ ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచే అవకాశం ఉంది. రేట్స్ అండ్ షోస్ అనే కాదు సలార్ అనేది ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమా కాబట్టి… రివ్యూలతో సంబంధం లేకుండా ఫస్ట్ డే ఓపెనింగ్స్‌తో సంచలనం క్రియేట్ చేయడం పక్కా. సలార్‌కు ఏ మాత్రం హిట్ టాక్ పడినా… బాక్సాఫీస్ దగ్గర వచ్చే వసూళ్ల సునామి మామూలుగా ఉండదు. మరి సలార్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!