NTV Telugu Site icon

Salaar KGF: రాఖీ భాయ్ ఉన్నట్లా లేనట్లా?

Salaar Kgf

Salaar Kgf

ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఈరోజు మార్నింగ్ షో పడే వరకూ పాన్ ఇండియా సినిమా అభిమానుల్లో ఉన్న ఏకైక డౌట్ ‘సలార్ సినిమాలో రాఖీ భాయ్ ఉన్నాడా లేదా’. ప్రభాస్ అండ్ యష్ ని ప్రశాంత్ నీల్ కలిపి చూపిస్తాడా? సలార్-రాఖీ భాయ్ క్లైమాక్స్ లో కనిపిస్తే  ఆ యుఫొరియా ఏ రేంజులో ఉంటుంది? ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తాడా లేదా? ఇన్ని ప్రశ్నలకి సమాధానం వచ్చేసింది. డిసెంబర్ 22న అర్ధరాత్రి షోస్ పడగానే అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయాయి.

ప్రశాంత్ నీల్ ముందు నుంచి చెప్తున్నట్లే… సలార్ సినిమాకి KGF సినిమాకి లింక్ లేదు. యష్ అండ్ ప్రభాస్ కలిసి కనిపించరు, సలార్-రాఖీ భాయ్ లకి అసలు సంబంధం లేదు. KGF పీరియాడిక్ డ్రామా, సలార్ మాత్రం ప్రస్తుతంలోనే జరుగుతూ ఉంటుంది. అక్కడ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఒక ప్రపంచం అయితే ఇక్కడ ఖాన్సార్ ఇంకో ప్రపంచం. ఇండియన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్ డ్రామాని తీసుకొచ్చి రాఖీ భాయ్ క్యామియో మర్చిపోయేలా చేసాడు ప్రశాంత్ నీల్. టైటిల్ కార్డ్స్ పడే సమయంలో యష్ కి స్పెషల్ థాంక్స్ కార్డ్ పడడంతో థియేటర్ లో కూర్చున్న ప్రతి ఒక్కరూ యష్ సినిమాలో ఉంటాడేమో అనుకున్నారు. సలార్ ఓపెనింగ్ సెరిమోనీకి యష్ వచ్చాడు కాబట్టి స్పెషల్ థాంక్స్ వేసాడు ప్రశాంత్ నీల్. ఈ ఒక్క లింక్ తప్ప రాఖీ భాయ్ అండ్ సలార్ లకి ఎలాంటి లింక్ లేదు. సో ఆ హోప్ తో థియేటర్స్ కి వెళ్తే మాత్రం వెళ్లకండి, ఒకవేళ మీరు అలా వెళ్లినా కూడా రాఖీ భాయ్ క్యామియో అవసరం లేని ప్రభాస్ ని చూపించాడు ప్రశాంత్ నీల్.

Show comments