ఇండియన్ కమర్షియల్ సినిమాలకి బాక్సాఫీస్ దగ్గర ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కి బాహుబలి లాంటి ప్రభాస్ కలిసి చేస్తున్న సినిమా ‘సలార్’. ‘డార్క్ సెంట్రిక్ థీమ్’తో రూపొందుతున్న ‘సలార్’ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు అనే వార్త వినిపిస్తోంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకూ ‘సలార్’ గురించి బయటకి వచ్చే వార్తలన్నీ రూమర్స్ లానే చూడాలి. సలార్ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది అనే వార్త కూడా ఇలాంటి రూమరే. ఈ రూమర్ గురించి ప్రొడ్యూసర్ ‘విజయ్ కిరగందుర్’ మాట్లాడుతూ “సలార్ సీక్వెల్స్ చెయ్యడానికి మేము రెడీగా ఉన్నాము కానీ ఫుల్ లెంగ్త్ సినిమా చూసిన తర్వాతే ఆ విషయంలో నిర్ణయం తీసుకుంటాము” అనే క్లారిటీ ఇచ్చారు. KGF 3 ప్రాజెక్ట్ కూడా సలార్ కంప్లీట్ అయ్యాకే ప్రశాంత్ నీల్ తో కూర్చోని మాట్లాడి ఒక డెసిషన్ కి వస్తామని ప్రొడ్యూసర్స్ తెలిపారు.
Read Also: CM Jagan: బడ్జెట్ అదే.. కానీ గత ప్రభుత్వం కంటే అప్పులు తక్కువే చేశాం
సలార్ సినిమా షూటింగ్ విషయానికి వస్తే, ఇప్పటివరకూ 85% షూటింగ్ కంప్లీట్ అయ్యింది. జనవరి ఎండింగ్ కి బాలన్స్ షూటింగ్ ని పార్ట్ కూడా కంప్లీట్ చేయ్యనున్నట్లు ‘విజయ్ కిరగందుర్’ తెలిపారు. “షూటింగ్ పూర్తి చేసిన తర్వాత దాదాపు ఆరు నెలల సమయాన్ని పోస్ట్ ప్రొడక్షన్ కోసం కేటాయించి, ది బెస్ట్ అవుట్పుట్ ని ఆడియన్స్ ని ఇస్తాము. సెప్టెంబర్ 28న సలార్ సినిమా ప్రపంచవ్యాప్త సినీ అభిమానుల ముందుకి వస్తుంది. నేను రషేష్ చూసాను. సలార్ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్. ప్రభాస్ మరియు పృథ్వీరాజ్ సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు” అంటూ ‘విజయ్ కిరగందుర్’ సలార్ అప్డేట్స్ ని షేర్ చేసుకున్నారు.
Read Also: Veera Simha Reddy: ఈ ఒక్క పాటతో తమన్ కి ఫుల్ బిర్యానీ పెట్టేయొచ్చు…
