Salaar: డైనోసర్ ల్యాండ్ అయ్యాడు.. ఇంకా మొదలెట్టరేంటి.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాపైనే ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి.. ఆదిపురుష్ తో హిట్ అందుకుంటాడు అనుకున్న డార్లింగ్.. డిజాస్టర్ ను అందుకున్నాడు. దీంతో సలార్ హిట్ అందుకుంటే.. ప్రభాస్ ఖాతాలో హిట్ పడుతుంది. ఇంకొకటి బాహుబలి తరువాత అంతటి హిట్ ప్రభాస్ అందుకున్నదే లేదు. అందుకే.. ఆ రికార్డ్ నుసలార్ బద్దలుకొడుతుందని అభిప్రాయపడుతున్నారు. దీనికోసమే డార్లింగ్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
Chiranjeevi: జవాన్ పాటకు చిరు స్టెప్స్.. ఆ గ్రేస్ ను ఎవరు కొట్టలేరు అంతే
Also Read
- Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్‌లో భారీ హైప్
- OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
- Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
- Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా.. మేకర్స్ లో అస్సలు చలనం లేదు. ఫ్యాన్స్ అందరూ.. అడగగా.. అడగగా.. సలార్ ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఒక సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లాలంటే.. ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ఉండాలి. ఇంకా సలార్ రిలీజ్ కు పట్టుమని నెల కూడా లేదు.. అయినా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది లేదు. ఇప్పటివరకు షూటింగ్ కూడాపూర్తికాలేదు. డైనోసర్ అమెరికా వెళ్ళాడు.. వచ్చిన వెంటనే ప్రమోషన్స్ అని చెప్పారు. కానీ, ప్రభాస్ రాగానే కాకినాడ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. వచ్చిన అవుట్ ఫుట్ ను చూసి ప్రశాంత్ హ్యాపీ గా లేకపోవడంతో మరోసారి రీ షూట్ చేయడం వలన ఇంత టైమ్ పడుతున్నదని కొందరి వాదన. ఇలాంటి పాన్ ఇండియా సినిమాకు ప్రమోషన్స్ కు ఎంత ఎక్కువ టైమ్ తీసుకుంటే అంత మంచిది. మరి ఇంకా షూటింగ్ కూడా పూర్తికాకుండా సలార్ టీమ్ ప్రమోషన్స్ ఎప్పుడు మొదలుపెడతారు.. ? ఏంటి.. ? అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్‌లో భారీ హైప్
-
Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
-
Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్‌తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!