NTV Telugu Site icon

Salaar: సలార్ వాయిదానే పడలేదు.. అప్పుడే మోహరించిన నాలుగు సినిమాలు!

Skanda Rules Ranjan Mad

Skanda Rules Ranjan Mad

Four Movies Targeted September 28 Salaar Date: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా 28వ తేదీ సెప్టెంబర్ నెలలో అంటే మరొక 20 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే విడుదల కావాల్సిన ట్రైలర్ రిలీజ్ వాయిదా పడటం ఇప్పటివరకు పూర్తయిన కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ ప్రశాంత్ నీల్ కి నచ్చలేదని ప్రచారం జరుగుతుండడంతో సలార్ సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీద సినిమా యూనిట్ అధికారికంగా ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని తెలిసినప్పటి నుంచి అదే తేదీ రావడానికి మూడు చిన్న సినిమాలు కర్చీఫ్ లు వేసేసుకున్నాయి.

Periods: మందులతో పీరియడ్స్ ను వాయిదా వేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే

ముందుగా ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా నటించిన మ్యాడ్ అనే సినిమా సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన రూల్స్ రంజన్ సినిమాను కూడా అప్పుడే రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇక సెప్టెంబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సిన స్కంధ సినిమాని కూడా ్ 28వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నారప్ప తర్వాత శ్రీకాంత్ అడ్డాల ఫుల్ లెన్త్ సెప్టెంబర్ లెంత్ మాస్ మసాలా మూవీగా పెదకాపు-1 కూడా వస్తోంది. ఇక ఇప్పటికీ అధికారిక ప్రకటన రాలేదు కానీ ఇలా చిన్న సినిమాలు అన్నీ అదే డేటుకు క్యూ కట్టడం హాట్ టాపిక్ అవుతోంది.

Show comments