Site icon NTV Telugu

Salaar: నార్త్ అమెరికాలో 8 మిళియన్స్… ఇలా జరగడం మూడోసారి

Salaar

Salaar

ఇండియన్ బాక్సాఫీస్ కి పూనకాలు తెప్పిస్తున్నాడు కాటేరమ్మ కొడుకు సలార్ దేవరథా రైజార్. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కలిసి సలార్ సినిమాతో మాస్ హిస్టీరియా అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. ప్రభాస్ కటౌట్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటే ఎలా ఉంటుందో ప్రశాంత్ నీల్ ప్రూవ్ చేస్తే… ప్రభాస్ ని పర్ఫెక్ట్ గా చూపిస్తే ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో ఫ్యాన్స్ చూపిస్తున్నారు. అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో సలార్ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. వరల్డ్ వైడ్ గా సలార్ 600 కోట్ల బెంచ్ మార్క్ ని రీచ్ అవ్వడానికి రెడీగా ఉంది. స్ట్రాంగ్ సండే అండ్ జనవరి 1 కూడా మంచి బుకింగ్స్ ఉంటాయి కాబట్టి దాదాపు మంగళవారం సలార్ నుంచి 600 కోట్ల పోస్టర్ బయటకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం  కేవలం నార్త్ అమెరికాలోనే సలార్ సినిమా ఎర్త్ షాటరింగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది.

ప్రీమియర్స్, డే 1 కలిపి సలార్ సినిమా 4 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసిన సలార్. ఇప్పటివరకూ నార్త్ అమెరికాలో 8 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసింది. ఈ బెంచ్ మార్క్ మూడుసార్లు దాటిన ఏకైక సౌత్ హీరో ప్రభాస్ మాత్రమే. గతంలో బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లుజన్ సినిమాలతో నార్త్ అమెరికాలో 8 మిలియన్ డాలర్స్ ని రాబట్టిన ప్రభాస్ ఇప్పుడు సలార్ తో మరోసారి ఆ మార్క్ ని రీచ్ అయ్యాడు. టాక్ బాగుంటే ప్రభాస్ సినిమా ఎలాంటి వండర్స్ కి క్రియేట్ చేస్తుందో సలార్ నిరూపిస్తోంది. నార్త్ అమెరికా రీజన్ లో సలార్ సినిమాని ప్రత్యంగిరా సినిమాస్ రిలీజ్ చేసింది. సాలిడ్ నంబర్ ఆఫ్ షోస్ సలార్ సినిమాకి దక్కేలా చేసిన ప్రత్యంగిరా సినిమాస్ సోషల్ మీడియాలో హోంబలే ఫిల్మ్స్ కన్నా యాక్టివ్ గా ఉండి ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నారు.

Exit mobile version