NTV Telugu Site icon

Salaar: సంతోషం… ఇప్పటికైనా వాయిదా అని చెప్పారు… మరి కొత్త రిలీజ్ డేట్?

Salaar

Salaar

ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్… రెండో సినిమాతోనే నయా రాజమౌళి అని పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా ‘సలార్’. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ నుంచి ఫస్ట్ పార్ట్ సలార్ సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సి ఉంది. డైనోసర్ బాక్సాఫీస్ పై చేయబోయే దాడి ఏ రేంజులో ఉంటుందని ఇండియన్ మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేసారు. ఈ వెయిటింగ్ ని డిజపాయింట్ గా మారుస్తూ మేకర్స్ సలార్ రిలీజ్ డేట్ ని వాయిదా వేశారు. ఈ వార్త గత కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉంది, ఈ వార్త వినిపించడం మొదలవగానే మిగిలిన సినిమాలు సెప్టెంబర్ 28ని కబ్జా చేయడం కూడా స్టార్ట్ చేసాయి. హోంబలే ఫిల్మ్స్ నుంచి మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. దీంతో ఎక్కడో ఒక చిన్న హోప్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఇన్ని రోజులు వెయిట్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు సలార్ ప్రొడ్యూసర్స్ నుంచి పోస్ట్ పోన్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చేసింది.

“We deeply appreciate your unwavering support for #Salaar. With consideration, we must delay the original September 28 release due to unforeseen circumstances. Please understand this decision is made with care, as we’re committed to delivering an exceptional cinematic experience. Our team is working tirelessly to meet the highest standards. The new release date will be revealed in due course. Stay with us as we make the final touches on #SalaarCeaseFire and thank you for being a part of this incredible journey.” అంటూ హోంబలే ఫిల్మ్స్ ట్వీట్ చేసారు. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ కావట్లేదు అని చెప్పిన మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ని త్వరలో అనౌన్స్ చేస్తామని చెప్పారు. మరి ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ ని కంప్లీట్ చేసుకోని సలార్ సినిమా థియేటర్స్ లోకి ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి.

 

Show comments