Site icon NTV Telugu

Salaar Teaser Memes: ఇండియన్ బాక్సాఫీస్‌పై దండయాత్రకు సమయం ఆసన్నమైంది.. సలార్‌ టీజర్‌ తుఫాన్ కోసం వెయిటింగ్‌!

Prabhas And Prashanth Neel

Prabhas And Prashanth Neel

Funny Memes Goes Viral on Prabhas Salaar Teaser: రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా ‘సలార్‌’. ఈ సినిమాను హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న సలార్‌ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ క్రమంలోనే సలార్‌ టీజర్‌కు డేట్ ఫిక్స్ చేసారు.

గురువారం (జులై 6) తెల్లవారుజామున 5.12 గంటలకు సలార్‌ టీజర్‌ విడుదల కానుంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 14 దేశాల్లో రిలీజ్ కానుంది. టీజర్‌ ఒక్కో దేశంలో ఒక్కో టైమ్‌కి టీజర్ రిలీజ్ అవుతుంది. దీంతో సలార్‌ టీజర్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే టీజర్‌పై తమకున్న అభిమానాన్ని మీమ్స్‌ రూపంలో ఫాన్స్, నెటిజన్లు పంచుకున్నారు. ప్రస్తుతం ఈ మీమ్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కొన్ని తెగ నవ్వు తెప్పిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Also Read: Salaar Movie Updates: సలార్ టీజర్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. అభిమానులకు పండగే ఇగ!

Also Read: Samantha Film Break: సమంత కీలక నిర్ణయం.. ఇక సినిమాలకు దూరం?

Exit mobile version