Salaar Movie Creates a New Non SSR Record in Nizam Area: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా మరిన్ని వసూళ్ల కోసం బాక్సాఫీస్ రన్ లో దూసుకుపోతోంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా అన్నిచోట్ల కలెక్షన్స్ పరంగా తన మార్కు చూపిస్తున్నా నైజాం ఏరియాలో నాన్ రాజమౌళి రికార్డు బద్దలు కొట్టినట్లు ట్రేడ్ వర్గాల వారు వెల్లడించారు. ఈ సినిమా మూడు రోజుల్లోనే దాదాపు 44.5 కోట్ల రూపాయల వసూళ్లు నైజాం ఏరియాలో సాధించింది. ఇక నాలుగు రోజులకు గాను 50 కోట్లకు పైగా షేర్ సాధించి నాన్ రాజమౌళి రికార్డు సృష్టించింది.
Ambajipeta Marriage Band: అంబాజీపేట మ్యారేజీ బ్యాండు బజాయించేది ఆరోజే
ఎందుకంటే ఇప్పటివరకు బాహుబలి 2 సినిమా మొత్తం రన్ లో గాను 68 కోట్ల షేర్ అందుకొని కొత్త రికార్డు సెట్ చేసింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత మళ్లీ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమానే 111 కోట్ల 85 లక్షల షేర్ సాధించి ఆల్ టైం రికార్డ్ ని మళ్ళీ సెట్ చేసింది. ఇక ఆ తర్వాత ఏ సినిమా నైజాం ఏరియాలో 50 కోట్ల మార్క్ అందుకోలేదు కానీ సలార్ నాలుగు రోజులతోనే 50 కోట్ల మార్కు దాటేసి ముందుకు వెళ్ళింది. సలార్ మేనియాతో మొదటి మూడు రోజులు టికెట్లు దొరకడమే గగనం అయిపోయింది, దానికి తోడు నాలుగో రోజు క్రిస్టమస్ సెలవులు కూడా కలిసి రావడంతో ఆ రోజు కూడా దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు అన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. మరిముఖ్యంగా నైజాం ఏరియాలో సలార్ కలెక్షన్స్ మరో సరికొత్త రికార్డు సెట్ చేయడం ఖాయమే అనే వాదన వినిపిస్తోంది. బాహుబలి రికార్డును చెరిపేసి ఆర్ఆర్ఆర్ రికార్డ్ దిశగా పరుగులు పెట్టిన ఆశ్చర్యం లేదు.