రెబల్ స్టార్ ప్రభాస్… ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కి ఇండియన్ బాక్సాఫీస్ ని రఫ్ఫాడించడానికి వస్తుంది సలార్. ఈరోజు నుంచి సరిగ్గా ఆరు రోజుల్లో తీరాన్ని తాకనున్న సలార్ తుఫాన్ ధాటికి ఎన్ని బాక్సాఫీస్ రికార్డులు లేస్తాయో లెక్కబెట్టడానికి ట్రేడ్ వర్గాలు రెడీగా ఉన్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సలార్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా కాబట్టి కలెక్షన్స్ కూడా ఆ రేంజులోనే ఉండబోతున్నాయి. బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో సలార్ టికెట్స్ కోసం ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. అయితే సలార్ ఫస్ట్ టికెట్ మాత్రం రాజమౌళి చేతికి వెళ్లింది. దర్శక ధీరుడు రాజమౌళితో సలార్ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేసారు. ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్వీరాజ్ తో రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూ చేసాడు.
ఇద్దరు సెన్సేషనల్ డైరెక్టర్స్ కలిసి చేసిన పాన్ ఇండియా ఇంటర్వ్యూ ఆడియన్స్ కి తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. ఈ ఇంటర్వ్యూలో సలార్ ఫస్ట్ టికెట్ ని రాజమౌళి తీసుకున్నాడు. దాదాపు పది వేలకి పైగా ఖర్చు పెట్టి సలార్ ఫస్ట్ టికెట్ ని రాజమౌళి దక్కించుకున్నాడు. డిసెంబర్ 22, ఉదయం 7 గంటల షోకి సంధ్య థియేటర్ టికెట్ ని రాజమౌళికి ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్వీ, మైత్రీ మూవీస్ మేకర్స్ ప్రొడ్యూసర్స్ కలిసి అందించారు. జక్కన్నకి ప్రభాస్ కి మధ్య ఉన్న రిలేషన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్టర్ అవ్వడం వెనక కూడా రాజమౌళి సపోర్ట్ చాలా ఉంది. KGF పార్ట్ 1 సినిమాని అందరికీ రీచ్ అయ్యేలా చేసింది రాజమౌళి చేసిన ఒక్క ట్వీట్, ప్రీరిలీజ్ ఈవెంట్ కి కూడా వెళ్లి KGFని ప్రమోట్ చేసిన రాజమౌళి, ఇప్పుడు సలార్ కోసం స్పెషల్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఈ ఇంటర్వ్యూ ఎప్పుడు బయటకు వస్తుంది? ఎంత ఫన్నీగా ఉండబోతుంది అనేది చూడాలి.
