Site icon NTV Telugu

Salaar: ఓరిని ఫ్యాన్ మేడ్ సాంగా? సడన్ గా చూసి ఒరిజినల్ అనుకున్నాం…

Salaar

Salaar

సలార్ క్రేజ్ ఎలా ఉందో చెప్పడానికి ఈ ఒక్క పాట చాలు అని చెప్పొచ్చు. అప్పుడప్పుడు మేకర్స్ ఇచ్చే అప్డేట్స్ కంటే ఫ్యాన్ మేడ్ పోస్టర్స్, విజువల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. ఇప్పటికే సలార్ సినిమా పై ఎన్నో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఏకంగా సలార్ టైటిల్ సాంగ్‌ను కంపోజ్ చేసి వదిలారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సాంగ్‌లో సలార్‌కు ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు. ఎంతలా అంటే… ఏకంగా ఈ సాంగ్‌కు సలార్ మేకర్స్ కూడా ఫిదా అయిపోయారు. ఆగష్టు 15న సలార్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాల్సిన మేకర్స్… ప్రస్తుతానికి ఈ ఫ్యాన్ మేడ్ ఫెంటాస్టిక్ సాంగ్‌ను ఎంజాయ్ చేయండి, మేము అంతకు మించిన పాటను ఇస్తాము అంటూ ఫ్యాన్ మేడ్ సాంగ్‌ను షేర్ చేశారు.

ఫ్యాన్సే ఇలా గూస్ బంప్స్ వచ్చేలా కొడితే, ఇక రవి బస్రూర్ ఇచ్చే మాసివ్ ట్యూన్ ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే సాంగ్స్‌ కూడా ఫ్యాన్సే చేసుకుంటే ఇక మీరేం చేస్తారని మేకర్స్‌ను అడుగుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇవ్వాల్సిన అప్డేట్స్ ఇవ్వకుండా… ఇలా కవర్ చేసుకోవడం ఎందుకు? ఫస్ట్ సలార్ ఫస్ట్ సింగిల్‌ని రిలీజ్ చేయమని… #WakeUpTeamSALAAR.. Trending with #FireStormIsComing, Release SALAAR First Song అనే ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు. అయినా కూడా సాంగ్ అప్టేడ్ మాత్రం ఇవ్వడం లేదు హోంబలే ఫిలింస్. ఏంటో ప్రమోషన్స్ లేట్ స్టార్ట్ చేసే ప్రొడక్షన్ హౌజ్ లన్నీ ప్రభాస్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ కే తగులుకుంటాయి. ఫ్యాన్స్ రిక్వెస్ట్ ని మన్నించి అయినా ప్రశాంత్ నీల్ అండ్ ప్రొడ్యూసర్స్ సలార్ సీజ్ ఫైర్ అప్డేట్స్ ఇస్తాడేమో చూడాలి.

Exit mobile version