Farzana: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో పృధ్వీ రాజ్ సుకుమారన్ , శ్రేయా రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఇక డిసెంబర్ 22 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా కేవలం ప్రభాస్ కు మాత్రమే కాదు.. అందులో నటించిన ప్రతి ఒక్కరిని సెలబ్రిటీలుగా మార్చింది. కేవలం రెండు మూడు సీన్స్ ఉన్న నటులు కూడా ఇప్పుడు స్టార్స్ గా మారిపోయారు. ఇక ఈ చిత్రంలో కాటేరమ్మ కొడుకును పంపింది అన్న ఒక్క ఎలివేషన్ సీన్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది సయ్యద్ ఫర్జానా. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నది సలార్ తో స్టార్ స్టేటస్ ను అందుకుంది.
ప్రభాస్ కు ఎలివేషన్ ఇవ్వడంలో ఫర్జానా నెక్స్ట్ లెవెల్ లో నటించి మెప్పించింది. సినిమా రిలీజ్ అయ్యాకా.. ఫర్జానా పేరు మారుమ్రోగిపోతుంది. వరుస ఇంటర్వ్యూలతో ఒక్కసారిగా బిజీగా మారింది. ఇక సోషల్ మీడియాలో సలార్ పాప.. అంటూ కొత్తగా పేరు కూడా పెట్టేసారు. ఈ చిన్నదాని పేరు సయ్యద్ ఫర్జానా. ఈ అమ్మడు.. సలార్ కన్నా ముందే ఎన్టీఆర్, అడివి శేష్, విశ్వక్ సేన్ లతో కలిసి నటించింది. విశ్వక్ నటించిన ఓరి దేవుడా సినిమాలో చిన్నప్పటి హీరోయిన్ గా నటించి మెప్పించింది. సలార్ తో ఫర్జానా రేంజ్ యే మారిపోయింది. ఇక ఫర్జానా ఇన్స్టా ఐడీ కోసం అభిమానులు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఆమె ఐడీ.. sayyed_farzana_official.. మరి ముందు ముందు ఈ చిన్నది హీరోయిన్ గా మారుతుందేమో చూడాలి.
