NTV Telugu Site icon

Salaar – DJ Crossover: సలార్ రాఖీ భాయ్‌ని కలిస్తే ఇలా ఉంటుందా? ఇదెక్కడి మాస్ క్రాస్ ఓవర్ మావా?

Salaar Dj Crossover

Salaar Dj Crossover

Salaar – DJ Crossover video viral in social media: కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు యావత్ భారత దేశవ్యాప్తంగా సినీ అభిమానులు అందరూ విపరీతంగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది సలార్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే గతంలో ప్రశాంత్ నీల్ చేసిన కేజిఎఫ్ సిరీస్ దేశవ్యాప్తంగా సూపర్ హిట్గా నిలిచిన నేపద్యంలో సలార్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ వంటి టాలెంటెడ్ నటీనటులను కూడా సినిమాలో భాగం చేయడంతో పాటు ప్రమోషన్ కూడా ఒక రేంజ్ లో ఎత్తేస్తున్న నేపథ్యంలో సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే తాజాగా విడుదలైన టీజర్ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అది టీజర్ లాగా లేదని ఫస్ట్ గ్లింప్స్ లాగా ఉందని అభిమానులు సహా సినీ ప్రేక్షకులు సైతం పెదవి విరుస్తున్నారు.

Mythri Movie Makers: రవితేజ-గోపీచంద్ కాంబోలో మైత్రీ మరో సినిమా.. 9న అధికారిక ప్రకటన

అయితే ఈ విషయంలో కొన్ని మీమ్స్ సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఒక క్రాస్ ఓవర్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. నిజానికి సలార్, కేజిఎఫ్ సినిమాల మధ్య లింక్ ఉందని ప్రశాంత్ నీల్ ఆ లింకును చాలా పర్ఫెక్ట్ గా తెరకెక్కించాడని ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన డీజే సినిమాలోని సుబ్బరాజు – రావు రమేష్ క్లైమాక్స్ సీన్ లో సుబ్బరాజు క్యారెక్టర్ ను రాఖీ భాయ్ గా, రావు రమేష్ క్యారెక్టర్ ను సలార్ లోని ప్రభాస్ గా చూపిస్తూ అన్ని కోట్లు ఏం చేశావు అని అడిగితే అమ్మ చెప్పిందని ఇచ్చేశాను అని చెబుతున్న డైలాగ్ ఆసక్తికరంగా మార్చారు. అక్కడ డబ్బులు గురించి ప్రస్తావనను బంగారం గురించి ప్రస్తావనగా మార్చి కామెడీగా మార్చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో ఏదో మీరు కూడా చూసేయండి.

Show comments