NTV Telugu Site icon

Salaar Dinosar: మిస్సింగ్ డైనోసర్… ఆ ఒక్కటీ మిస్ అయ్యిందే

Salaarrrr

Salaarrrr

వరల్డ్ వైడ్‌గా ఉన్న గ్యాంగ్‌స్టర్స్ అంతా కలిసి… వాడెక్కడ అంటూ అరుస్తు టిన్నూ ఆనంద్‌ను టార్గెట్ చేశారు. ఏయ్.. సింపుల్ ఇంగ్లీష్, నో కన్ఫ్యూజన్.. Lion…Cheetah…Tiger… Elephant are Very Dangerous, But Not in Jurassic Park… because there is a ‘డైనోసర్’.. అంటూ టిన్నూ ఆనంద్ ఇచ్చిన ఎలివేషన్‌కు డిజిటల్ మీడియా రికార్డ్స్ అన్నీ చెల్లా చెదురు అయ్యాయి. సలార్ నుంచి వచ్చిన ఫస్ట్ టీజర్ ఇదే. దీని దెబ్బకు సోషల్ మీడియాలో గత ఐదారు నెలలుగా సలార్ ప్రస్థావన వచ్చినప్పుడల్లా… డైనోసర్ అంటూ ఎలివేషన్ ఇస్తునే ఉన్నారు. ఈ ఒక్క టీజర్‌తో ప్రభాస్ క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుందో చెప్పేశాడు ప్రశాంత్ నీల్. దీంతో సలార్ ఫస్ట్ పార్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేశారు. ఫైనల్‌గా ఈ మోస్ట్ అవైటేడ్ మూవీ థియేటర్లోకి వచ్చేసింది. నైట్ ఒంటిగంట షో నుంచే సలార్‌కు హిట్ టాక్ పడిపోయింది. ప్రభాస్ లాంటి మాస్ కటౌట్‌కి ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్ పీక్స్‌లో ఉంది. ఇది కదా కావాల్సింది… అంటూ పండగ చేసుకుంటున్నారు అభిమానులు.

రిపీట్ మోడ్‌లో థియేటర్లకు పరుగులు తీస్తున్నారు కానీ సలార్ ఫస్ట్ టీజర్‌లో చెప్పిన డైలాగ్ మాత్రం పార్ట్ వన్‌లో లేదు. ట్రైలర్‌లో ఉన్న ప్రతి డైలాగ్, షాట్స్… సీజ్ ఫైర్‌లో ఉన్నాయి. డైనోసర్‌గా ప్రభాస్‌కు ఇచ్చిన ఎలివేషన్ డైలాగ్ మాత్రం మిస్ అయింది కానీ అసలైన బొమ్మనే ముందు చూపించాడు ప్రశాంత్ నీల్. సింపుల్ ఇంగ్లీష్ టీజర్‌లో టిన్ను ఆనంద్ చెప్పింది సలార్ ఫస్ట్ పార్ట్ గురించి మాత్రమే. ఇంటర్నేషనల్ లెవల్లో సలార్‌ను టార్గెట్ చేసిన వారికి… అక్కడుంది డైనోసర్ చస్తార్రా అని.. సెకండ్ పార్ట్‌లో టిన్ను ఆనంద్ చెప్పే డైలాగ్‌నే సలార్ ఫస్ట్ టీజర్‌లో చూపించినట్టుంది. అంటే, ఫస్ట్ రిలీజ్ చేసిన సలార్ టీజర్ సెకండ్ పార్ట్‌ది అన్నమాట. ఈ లెక్కన పార్ట్‌ 2 శౌర్యాంగ పర్వంలో జరగబోయే ఊచకోత మామూలుగా ఉండదు. ఫస్ట్ పార్ట్‌లో ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్ ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ఉంది. అలాంటిది… సెకండ్ పార్ట్‌లో డైనోసర్ ఎటాక్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ డైనోసర్ ఎటాక్ ఎప్పుడుంటుందో చూడాలి.